నల్లని పాదాలను వదిలించుకోండిలా

How to reduce Dark Feet

03:19 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

How to reduce Dark Feet

అందమైన పాదాలు తేమ, చెమట, ప్రతి రోజు ఎక్కువగా నడవటం, సూర్యరశ్మి వంటి కారణాల వలన నల్లని పాదాలుగా మారతాయి. పాదాలు నల్లగా ఉంటే మనకు ఇష్టమైన బూట్లు మరియు చెప్పులు వేసుకోవటానికి కొంచెం కష్టం అవుతుంది. అప్పుడు నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది. సూర్యకాంతి నేరుగా పడటం వలన మృత కణాలు
మరియు పొడి కారణంగా పాదాలు సహజ రంగును కోల్పోతాయి. ఇప్పుడు సహజంగా, కేవలం ఒక వారం రోజుల్లోనే ఇంటి నివారణలతో ఈ సమస్య నుండి బయట పడవచ్చు. ఇక్కడ నల్లని పాదాలను వదిలించుకోవటానికి కొన్ని సహజ నివారణలు ఉన్నాయి.

1/7 Pages

1. చక్కెర మరియు నిమ్మ స్క్రబ్

పాదాల నలుపును తొలగించుకోవటానికి స్క్రబింగ్ చేయటం ముఖ్యం. స్క్రబింగ్ చేయటానికి చక్కెర మరియు నిమ్మ బాగా సహాయపడతాయి.

కావలసినవి

నిమ్మకాయ - 1
చక్కెర - 1 స్పూన్

పద్దతి

* మొదట పాదాలను శుభ్రంగా కడిగి, ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో కొంచెం సేపు ఉంచాలి.
* నిమ్మకాయను సగానికి కట్ చేసి దాని మీద చక్కెరను జల్లి స్క్రబింగ్ ప్రారంభించాలి.
* కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు స్క్రబింగ్ చేయాలి. ఆ తర్వాత 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
* ఆ తర్వాత పాదాలను శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాయాలి. బయటకు వెళ్ళిన ప్రతిసారి సన్ స్క్రీన్ రాయటం మర్చిపోకూడదు. ఈ విధంగా ప్రతి రోజు ఒక వారం పాటు చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.

English summary

Some natural home remedies to get rid of dark feet and you will find some easy tips to make your feet fairer.