ఏడు రోజుల్లో మచ్చలు మాయం

How to reduce Dark Spots in 7 Days

03:22 PM ON 19th May, 2016 By Mirchi Vilas

బ్లాక్‌హెడ్స్ ఇంకా సన్‌టాన్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. బ్లాక్‌హెడ్స్ మరియు మచ్చల వల్ల చర్మం అంద విహీనంగా తయారయి చూడడానికి బావుండదు. అయితే ఇవి తగ్గించుకునే మార్గంలో మార్కెట్లో దొరికే అనేక రసాయన క్రీములను వాడి నష్టపోతుంటారు చాలా మంది. అయితే అలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఇంట్లో ఉంటూనే 7 రోజులలో మీ సమస్యను తీర్చుకోవచ్చు. ఆ ఏడురోజుల అద్భుత ప్లాన్ ఏమిటో చూద్దామా.

6/8 Pages

6వ రోజు

ఉదయాన్నే రెండు స్పూన్ల తేనెలో ఒక స్పూను నిమ్మరసం కలిపి అందులో ఒక స్పూను ఆలివ్ ఆయిల్ అర టీ స్పూన్ పంచదార వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. మధ్యాహ్నం ఫ్రిజ్‌లో రెండు టీ బ్యాగ్‌లను ఉంచాలి. అవి కొద్దిగ చల్లగా అయిన తరువాత రెండు కళ్ళ మీద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళ చుట్టూ ఉన్న నల్లని వలయాలు తగ్గుతాయి. సాయం కాలం నారింజ రసంలో తేనె కలిపి ముఖానికి రాసుకుని అరగంట ఉంచి శుభ్రం చేసుకోవాలి.

English summary

Here we have listed about how to reduce Dark Spots in one week. If you have black spots, dark spots, acne marks, sun tan then you follow these home remedies you get desired result.