పొట్టలోని కొవ్వును కరిగించుకోండిలా!!

How to reduce fat belly

12:57 PM ON 21st December, 2015 By Mirchi Vilas

How to reduce fat belly

ఈ మధ్య కాలంలో 35 ఏళ్ళు దాటాయంటే చాలు పొట్ట సమస్య వచ్చేస్తుంది. ఎన్ని వ్యాయామాలు చేసిన చాలామంది ఈ పొట్టని ఆపలేక పోతున్నారు. ఒక్కసారి వచ్చిందంటే చాలు దీన్ని మనం ఆపలేము. అందువల్ల ముందుగానే కొన్ని జాగ్రత్త్రలు తీసుకుని పొట్టరాకుండా చూసుకోవాలి. భారతీయులు ఎక్కువగా గోధుమలు, మసాలాలు వాడుతారు అందువల్ల ఈ సమస్య భారతీయులను ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. పొట్ట రావడం, రాకపోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి కొన్ని ఆహార నియమాలను పాటించడం వల్ల పొట్ట తగ్గించుకోవచ్చు. పొట్ట రావడానికి గల ప్రధాన కారణాలు, పొట్ట తగ్గించుకునే మార్గాలు, రాకుండా తీసుకోవలసిన జాగ్రతలు ఏమిటో తెలుసుకుందాం..

  • ఎక్కువగా నాన్‌వెజ్‌ ఆహారాన్ని తీసుకోకూడదు. మసాలాలు ఎక్కువగా తినడం వలన బరువు పెరుగుతారు. దాంతో పొట్టకూడా బాగా పెరిగిపోతుంది. అప్పుడు మీకు చాలా ఇబ్బంది కరమైన సమస్యగా తయారవుతుంది.
  • రోజు గుడ్లు తినడం వల్ల శరీరం బరువు పెరగడంలో తోడ్పడుతుంది. అందువల్ల పొట్టకూడా పెరిగిపోతుంది. గుడ్డు, గుడ్డుతో చేసిన పదార్ధాలకు దూరంగా ఉండాలి.
  • ఆకుకూరలు మరియు కూరగాయలు శరీరంలోని కొవ్వుని తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల ఉడికించిన కూరగాయలను, ఆకుకూరలను రోజు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవడం చాలా మంచిది.
  • బార్లీ కూడా కొవ్వును తగ్గించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. రోజూ బార్లీజావ తాగడం వల్ల ఆరోగ్యంతో పాటు అందమైన శరీరాకృతి మీ సొంతం అవుతుంది.
  • క్యారెట్‌, కాలీప్లవర్‌, కీరదోస, పచ్చి కూరగాయలు, శరీరానికి ఎంతో మంచిది. పచ్చి బటానీలు, పెసలు, మినుములు ఉడకబెట్టినవి తీసుకోవడం ఉత్తమం.
  • బేకరీలో దొరికే ఆహారపదార్ధాలను తినకుండా ఉండడమే మేలు. ఐస్‌క్రీములు ఇలాంటివి తినడం వల్ల ఊబకాయం వస్తుంది. తీపి తినడం తగ్గించుకోవాలి.
  • మార్కెట్‌ లో దొరికే వివిధ రకాల చిప్స్‌ ఉదాహరణకి బంగాళదుంప చిప్స్‌ తినడం వలన శరీర బరువు పెరుగుతుంది.
  • ఆహారాన్ని ఒక క్రమబద్ధంగా తినాలి. రోజూ ఒకే సమయానికి తినడం చాలా మంచిది. రోజుకో సమయంలో తినడం వలన గాస్ట్రిక్‌ సమస్యతో పాటు పొట్టకూడా పెరిగిపోతుంది. అంతేకాకుండా అనారోగ్యపాలు అవుతారు. అందువల్ల సరైనా సమయానికి సరైన పద్దతిలో మంచి తిండిని తినడం ఉత్తమం.
  • రోజూ ఉదయాన్నే గ్రీన్‌ టీ తాగడం చాలామంచిది. ఇది చక్కటి ఆరోగ్యంతో పాటు నాజుకైన శరీరాన్ని అందిస్తుంది. ఉదయాన్నే గ్రీన్‌ టీ తాగడం వలన శరీరంలోని కొవ్వును దరి చేరనివ్వదు.
  • అంతేకాకుండా రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక చెంబుతో మంచి నీటిని తాగడం వలన జీర్ణక్రియ శక్తికి తోడ్పడంతో పాటు పొట్టని శుభ్రం చేస్తుంది.
  • అంతే కాకుండా భోజనం చేసిన వెంటనే నీటిని తాగడం మంచిది కాదు. కొంత సమయం తరువాత నీటిని తాగడం మంచిది.
  • అదే విధంగా భోజనం అనంతరం వెంటనే ఎటువంటి పదార్ధాలను తినకూడదు. అరగంట ఆగిన తరువాత తినడం వల్ల తిన్న భోజనం సక్రమంగా అరుగుతుంది.
  • రాత్రుళ్ళు నిద్ర సరిగా పోకపోయినా కూడా శరీరం బరువు పెరుగుతుంది. అందువల్ల సాయంత్రం 7 నుండి 8 లోపు భోజనం చేసేసి తొందరగా పడుకోవడం చాలామంచిది.
  • భొజనం చేసిన వెంటనే పడుకోరాదు. ఇలా చేయడం వల్ల ఊబకాయం వస్తుంది. సాయంత్రం వేళలో భోజనం తొందరగా చేయడం వల్ల నిద్రించే సమయానికి భోజనం అరిగి బాగా నిద్రపడుతుంది. అదే నిద్రించే సమయంలో హడావిడిగా తిని వెంటనే పడుకోవడం వల్ల నిద్రకి భంగం వాటిల్లుతుంది.
  • అందువల్ల సమయానికి తిని, పడుకోవడం మంచిది. ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
  • ఉద్యోగం చేసేవారు ఒకే స్థలంలో అలా కూర్చొని ఉండకుండా అరగంటకి లేదా గంటకి ఒకసారి లేచి నడవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కదలకుండా కుర్చీలకి అతుక్కుని కూర్చోవడం వలన బొజ్జ పెరిగే అవకాశం అధికం.
  • కొంచెం కొంచెం దూరాలకు కూడా నడవకుండా వాహనాలను వాడుతున్నారు. దీనివల్ల కూడా పొట్ట సమస్య పెరిగిపోతుంది. అందువల్ల ఎక్కువ శాతం నిడవడానికే ప్రాధాన్యత ఇవ్వండి.
  • ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
  • వారంలో ఒకపూట ఉపవాసం ఉండడం వల్ల మీ జీర్ణక్రియ శక్తి మెరుగుపడుతుంది. ఇంకా శక్తి వంతంగా పనిచేస్తుంది.

English summary

Belly fat is usually estimated by measuring the circumference around your waist. This can easily be done at home with a simple tape measure.