అధిక రక్తపోటును తగ్గించటానికి ఇంటి నివారణలు

How to reduce high blood pressure

04:33 PM ON 8th February, 2016 By Mirchi Vilas

How to reduce high blood pressure

ఈ రోజుల్లో అధిక రక్తపోటు అనేది సాదారణ ఆరోగ్య సమస్యగా మారిపోయింది. ధమనులలో రక్తం మీద కృత్రిమ పీడనం ఏర్పడినప్పుడు వచ్చే పరిస్థితిని రక్తపోటు అని అంటారు. సాధారణంగా రక్తపోటును సిస్టోలిక్ మరియు డయస్టాలిక్ కదలికల ద్వారా కొలుస్తారు. రక్తపోటు 140/90 mmHg పైన ఉంటే అధిక రక్తపోటుగా గుర్తిస్తారు.

ఈ సమస్య రావటానికి ఒత్తిడి, జన్యుపరమైన కారణములు, ఉప్పు అధికంగా తీసుకోవడం, స్థూలకాయం, అధిక మద్యం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, పెయిన్ కిల్లర్స్ వాడకం, ఎడ్రినల్ వ్యాధులు మరియు మూత్రపిండాల వ్యాధుల వంటివి కారణాలుగా ఉన్నాయి.

అధిక రక్తపోటు కారణంగా గుండె వైఫల్యం, ధమని వ్యాధి, గుండె పోటు, స్ట్రోక్  మరియు మూత్రపిండాల వైఫల్యాల వంటి అనేక దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు వస్తాయి. రక్తపోటు తగ్గించుకోవటానికి అనేక మందులు ఉన్నాయి. కానీ అధిక రక్తపోటును సహజంగా తగ్గించుకోవటానికి కొన్ని ఇంటి నివారణలు కూడా ఉన్నాయి.

1/11 Pages

1. అరటి పండు

అరటిపండు రక్తపోటును తగ్గించటానికి ఉత్తమ సహజ నివారణ మార్గంగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే ప్రతి రోజు ఒకటి లేదా రెండు అరటిపండ్లను తినాలి. అరటిపండులో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు స్థాయిలను  నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే తక్కువ సోడియం స్థాయిలు, కొలెస్ట్రాల్ తగ్గించటానికి కూడా అరటిపండు సహాయపడుతుంది.

English summary

Here are the list of Home remedies for high blood pressure. Hypertension may lead to many chronic health conditions including heart failure, peripheral arterial disease, stroke, and chronic kidney failures.