ముక్కుదిబ్బడకు 2నిమిషాలలో ఉపశమనం

How to relief from cold and body pains

04:05 PM ON 16th November, 2015 By Mirchi Vilas

How to relief from cold and body pains

బ్రతకడానికి గాలి పీల్చుకోవడం చాలా అవసరం. గాలిపీల్చడంలో ఇబ్బందులు ఎదురైతే ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. శరీరంలోని మలినాలను ముక్కుద్వారా శరీరం వదులుతుంది. ఒక్కోసారి జలుబు చేసినప్పుడు లేదా కొన్నిసార్లు చలిలో బయటకు వెళ్ళినపుడు ముక్కు మూసుకుపోతోంది. అప్పుడు గాలి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ముక్కు దిబ్బడతో బాధపడేవారికి ఇంటిలోనే కొన్ని నివారణ మార్గాలను ఇప్పుడు చూద్దాం.

ముక్కుకు మసాజ్‌

ముక్కుకు మసాజ్‌ చేయడం వలన రెండు నిమిషాలలో ఉపశమనం లభిస్తుంది. మీ ముక్కు మీద మీ చూపుడు వేళ్ళతో మసాజ్‌ చేయాలి. ఇలా ఇరువైపులా చేయాలి. సమానమైన ఒత్తిడి కలిగించి మసాజ్‌ చేయడం వలన ఉపశమనం ఉంటుంది. తర్వాత దవడ ఎముకలకు, కంటి మూలగా మసాజ్‌ చేయాలి. చివరిగా చెవలని 30 నిముషాల పాటు వేళ్ళతో మసాజ్‌ చేయాలి. తర్వాత మీరు ఒక అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు.

ఉప్పు నీరు ఆవిరిపట్టడం

ముక్కుదిబ్బడలకు వెంటనే ఉపశమనం పొందాలంటే ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఉప్పునీటిని ఆవిరి పట్టడం ద్వారా త్వరిత ఉపశమనం కలుగుతుంది. మూసుకుపోయిన ముక్కుకి ఇది మంచి సత్వర పరిష్కారం. ఒక టేబుల్‌ స్పూన్‌ ఉప్పు, వేడునీళ్ళు తీసుకుని బాగా కలియబెట్టి ఆవిరి తీసుకోవాలి. వేడినీళ్ళతో స్నానం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీనివల్ల ముక్కుదిబ్బడ వలన వచ్చే ఒంటినొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

ఉల్లిపాయలను కత్తిరించండి

మీరు ఎప్పుడైనా ఉల్లిపాయలను తరిగినప్పుడు కళ్ళనుండి నీరు కారుతుంది గమనించారా. ఇది కూడా ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం కలగడానికి ఉపయోగపడుతుంది. అంటే మామూలుగా ఉల్లిపాయలు కోసేటప్పుడు వచ్చే ఇబ్బంది ముక్కు దిబ్బడను దూరం చేస్తుంది అన్నమాట. కారంగా ఉన్న పధార్థాలు తినడం వలన కూడా ముక్కు దిబ్బడ నుంది విముక్తి లభిస్తుంది.

నీరు ఎక్కువగా తీసుకోండి

నీరు అధికంగా తాగడం వలన శరీరానికి అధిక మొత్తంలో మినరల్స్‌ లభిస్తాయి..నీరు అధికంగా తాగడం వలన శరీరానికి అధిక మొత్తంలో మినరల్స్‌ లభిస్తాయి. శరీరం డీహైడ్రేట్‌ కాకుండా ఉంటుంది. నీరు ఎక్కువగా తాగడం కూడా అన్నివిధాలా శరీరానికి మంచిదే. ఇలా పైన తెలిపిన చిట్కాలు ఇంట్లోనే పాటించడం వలన జలుబు, దగ్గు, ఒళ్ళునొప్పుల నుండి చక్కటి పరిష్కారం లభిస్తుంది.

English summary

How to relief from cold and body pains.In four ways to reduce our body pains and relief from cold.