బ్లాక్‌హెడ్స్‌ ని తొలగించుకోండిలా...

How to remove blackheads

07:19 PM ON 9th December, 2015 By Mirchi Vilas

How to remove blackheads

దుమ్ము , కాలుష్యం వల్ల బ్లాక్‌హెడ్స్‌ ఏర్పడతాయి. ఇవి చర్మం ఉపరితలం మీద నల్లగా చిరాకుగా కనపడతాయి. ఇవి ప్రధానంగా ముక్కుమీద ఎక్కువగా ఉంటాయి. వీటిని అలాగే వదిలేయడం వల్ల తొలగించడం కష్టం అవుతుంది. అందువల్ల ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ బ్యాక్‌హెడ్స్‌ చర్మంపై రంద్రాలలో కాలుష్యం, కొవ్వు, క్రిములు, మృతకణాలు మొదలగు వాటి వల్ల కారణమవుతాయి. ఇవి సాధారణంగా గోధుమ రంగుతో మొదలవుతాయి. క్రమక్రమంగా అవి వృద్ధి చెంది నలుపుగా మారుతాయి. వీటిని తొలగించడం కొంచెం కష్టమైన పనే అయినా అసాధ్యమైన పనికాదు. కొన్ని పద్ధతులను పాటించడం వలన ముక్కు, బుగ్గలపై గల బ్లాక్‌హెడ్స్‌ ని తొలగించుకోవచ్చు.

1/11 Pages

1. ఆవిరి పట్టడం

సులభమైన పద్ధతి ఆవిరి పట్టుకోవడం. దీనివల్ల వైట్‌, బ్లాక్‌హెడ్స్‌ తొలగిపోతాయి. ఆవిరి పట్టుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆవిరి పట్టుకోవాలి. అతి వేడిని ఆవిరిగా పట్టకూడదు. దానివల్ల ముఖం పై మృదువైన చర్మం కమిలిపోతుంది. అందుకని ఫేషియల్‌ స్టీమింగ్‌ వాడడం మంచిది.

కావలసినవి:

  • టర్కీటవల్‌ - 1
  • నిమ్మరసం -(ఆప్షనల్‌)
  • నీళ్ళు - 3 లేదా 4 కప్పులు

తయారుచేసే విధానం:

  • 3 లేదా 4 కప్పుల నీటిని ఒక పాత్రలోకి తీసుకుని వేడి చేయాలి.
  • బాగా కాగిన తరువాత స్టవ్‌మీద నుండి కిందకి దించి కొన్ని చుక్కలు నిమ్మరసం వేయాలి.
  • తరువాత టవల్‌తో ఒక డేరా లా వేసుకొని ఆవిరి పట్టుకోవాలి.
  • వేడికి కొంత దూరంలో ఉండి ఆవిరి పట్టడం మంచిది.
  • ఇలా ఆవిరి పట్టడం పూర్తయిన తరువాత టవల్‌ని తీసివేసి ముఖాన్ని మాములు నీళ్ళతో కడగాలి.
  • కఠినమైన పద్ధతిలో  ముఖాన్ని కడగరాదు. దానివల్ల చర్మం దెబ్బతింటుంది.

English summary

You have blackheads don’t feel bad. Homemade tips are available here follow these steps you get smooth and fair skin.