సన్ టాన్ తొలగించుకోవటానికి సహజమైన పాక్స్

How to Remove Sun tan

07:22 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

How to Remove Sun tan

సాదారణంగా వేసవికాలంలో చిన్న చిన్న దుస్తులతో పార్క్ లేదా బీచ్ లో స్నేహితులతో అస్వాదిస్తాం. ఆ సమయంలో సూర్యుని కారణంగా చేతులు మరియు ముఖం అసహ్యంగా మారతాయి.  సన్ టాన్ వదిలించుకోవటానికి సమయం లేకపోవటం వలన బ్లీచ్ మరియు రసాయన ఆధారిత  సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తాం. ఈ ఉత్పత్తులను వాడుట వలన సున్నితమైన చర్మంపై తీవ్రమైన ప్రభావం చూపటమే కాక దీర్ఘకాలంలో ప్రాణాంతకమైన దుష్ప్రభావాలను చూపుతుంది. అందువలన సన్ టాన్ వదిలించుకోవటానికి ఇంటి నివారణలు ఉత్తమమైనవి.

సన్ టాన్ వలన కలిగే హానికరమైన ప్రభావాలు

సూర్యుడు యొక్క అల్ట్రా వైలెట్ కిరణాల (UVA మరియు UVB) ఎక్కువగా చర్మం మీద పడినప్పుడు చర్మంలో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా చర్మం నల్లగా మారుతుంది. సాధారణంగా సన్ టాన్ అనేది శరీరంలో ముఖం, మెడ, చేతులు, మరియు కాళ్ళ బాగాలలో కనపడుతుంది. అంతేకాక సన్ టాన్ అనేది అనేక రకాల చర్మ
సమస్యలకు కారణమవుతుంది. వాటి గురించి తెలుసుకుందాం. అవి

  • మొటిమలు
  • లైన్స్
  • ముడుతలు
  • నల్లని మచ్చలు
  • హైపర్ పిగ్మెంటేషన్
  • తొందరగా వృధాప్య లక్షణాలు
  • చర్మం మండుట
  • తీవ్రమైన సందర్భాల్లో, చర్మ క్యాన్సర్ కి దారితీస్తుంది .

సహజమైన పదార్ధాలను ఉపయోగించి సన్ టాన్ తొలగించటానికి ఇంటి నివారణలు

1/15 Pages

1. దోసకాయ, రోజ్ వాటర్ మరియు నిమ్మ రసం ప్యాక్

దోసకాయ మరియు నిమ్మకాయ రెండు కూడా  పరిపూర్ణమైన సహజ బ్లీచింగ్ కారకాలు. సన్ టాన్  తొలగించుకోవటానికి  తయారుచేసుకొనే అత్యంత ప్రభావవంతమైన ఫేస్ ప్యాక్ లలో ఇది ఒకటి. నిమ్మకాయ రసంలో విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ సమృద్దిగా ఉండుట వలన చర్మ టోన్ కి సహాయం మరియు  స్పష్టమైన చర్మాన్ని
నిర్వహించటానికి సహాయపడుతుంది. విటమిన్ సి వంటి శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్  ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాన్ని తటస్థీకరించి సన్ టాన్, వయస్స రిత్యా వచ్చే  మచ్చలు, నల్లని మచ్చలు తగ్గటానికి సహాయపడుతుంది. నిమ్మకాయ నివారణను ఉపయోగించినప్పుడు తప్పనిసరిగా ఆధిక SPF కలిగిన సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. ఎందుకంటే నిమ్మరసంలో ఆమ్ల గుణం ఉండుట వలన సూర్యుని UV కిరణాలు చర్మాన్ని సున్నితంగా మారుస్తాయి.

ఒక బౌల్ లో ఒక స్పూన్ దోసకాయ రసం,ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ రోజ్ వాటర్ తీసుకోని బాగా కలిపి ప్రభావిత ప్రాంతంలో రాసి 10 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ ని ప్రతి రోజు ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత వేసుకోవాలి.

English summary

Sun tan usually occurs on body parts that are exposed to sun such as, face, neck, arms, and legs. Sun tan causes various skin problems.