పేళ్ళ సమస్యతో విముక్తి పొందండిలా !!!

How to remove Ticks

05:24 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

How to remove Ticks

పేలు సమస్యతో బాధపడుతున్నవారికి ఒక అద్బుతమైన చిట్కా వెల్లుల్లి. వెల్లుల్లి పేలను చంపడం లో ముఖ్యపాత్ర వహిస్తుంది. పేలు చిన్నపిల్లలతో, ఎక్కువగా స్కూల్ కి వెళ్ళే పిల్లల లో ఉంటాయి. పేలు ఒకరి నుండి మరోకరికి వ్యాప్తి చెందుతాయి. ఒకరి పక్కన ఒకరు కూర్చోవడం, పడుకోవడం వలన పేలు ఒకరి నుండి మరోకరికి సోకుతాయి. వీటి వల్ల ఎటువంటి వ్యాదులు రావు. ఇవి తలలో గుడ్లు పెట్టి పిల్లలుగా మారిన తరువాత తల పైన రక్తాన్ని తాగుతాయి. దీనివల్ల చర్మంపై దురద, మంట ఏర్పడుతుంది. దాని ఫలితంగా గోర్లతో గోకడం వలన చర్మం చీలిపొయి విసరీతమైన దురద పుడుతుంది. పేలుదువ్వెన తో దువ్వితే కొన్ని పేలు వస్తాయి. కాని పూర్తిగా సమస్య పరిష్కారం కాదు. పూర్తిగా పరిష్కారం లభించాలంటే కింది చిట్కాలను వాడండి.

1. వెల్లుల్లి, నిమ్మరసం

కావలసినవి:

 • 5 గ్రాములు - వెల్లుల్లి
 • 3 టీ స్పూన్ - నిమ్మరసం

ఉపయోగించే విధానం:

 • 5 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను నూరి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
 • ఈ పేస్ట్ 3 టీస్పూన్ల నిమ్మరసాన్ని కలపాలి.
 • వచ్చిన మిశ్రమాన్ని తలకి పూర్తిగా పట్టించి 40 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటీతో తలకి స్నానంచేయాలి.
 • స్నానం చేసిన తరువాత తలని బాగా దువ్వెనతో దువ్వాలి ఫలితం గా పేల సమస్య దూరం అవుతుంది.

2. వెల్లుల్లి, షాంపూ

కావలసినవి:

 • వెల్లుల్లి రసం
 • వంటనూనె /నిమ్మరసం /గ్రీన్‌టీ డికాక్షన్ /షాంపూ

ఉపయోగించే విధానం :

 • వెల్లుల్లి పాయ రసంతీసుకొని అందులో సమపాళ్ళలో వంటనూనె లేదా నిమ్మరసం లేదా గ్రీన్‌టీ డికాక్షన్ లేదా షాంపూ కలిపి తలకి రాసుకోవాలి.
 • తలని ఏదైనా టవల్‌తో చుట్టి 40 నిమిషాల తరువాత వేడి నీటితో తలకి స్నానం చేయడం వలన పేలు నశించిపోతాయి.

3. ఆలివ్ ఆయిల్

కావలసినవి:

 • ఆలివ్ ఆయిల్

ఉపయోగించే విధానం:

 • పడుకునే ముందు ఆలివ్ ఆయిల్‌ని జుట్టు కుదుళ్ళుకు బాగా పట్టించాలి.
 • ఉదయం లేవగానే దువ్వెనతో దువ్వితే చచ్చిపోయిన పేలు వస్తాయి. తరువాత వేడినీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేయడం వలన పేలబాధ ఉండును.

4. ఉల్లిపాయ

కావలసినవి:

 • ఉల్లిపాయలు- 6 లేదా 7

ఉపయోగించే విధానం:

 • 6 లేదా 7 ఉల్లిపాయలను మిక్సీలో వేసి జ్యూస్ చేయాలి. వచ్చిన రసాన్ని వడకట్టి తలకి పట్టించాలి.
 • ఒక గంట తరువాత వేడి నీటితో తలకి స్నానం చేయాలి. ఇలా చేయడం వలన పేల సమస్య దూరం అవుతుంది.
 • ఇది వారం రోజుల పాటు చేయడం వల్ల పేల నుండి విముక్తి పొందుతారు.

5. బాదం పప్పు, నిమ్మరసం

కావలసినవి:

 • బాదం పప్పులు - 10
 • నిమ్మరసం - 4 టేబుల్ స్పూస్

ఉపయోగించే విధానం:

 • 10 బాదం పప్పులను నీటిలో రాత్రంతా నానాపెట్టాలి.
 • తరువాత రోజు ఉదయం బాదం పప్పుల తోక్కతీసీ బాగా మెత్తగా పేస్ట్ చేయాలి.
 • బాదం పప్పుల పేస్ట్ లో 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని తలకిబాగా పట్టించాలి.
 • అరగంట తరువాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వలన పేల సమస్య నుండి విముక్తి లభిస్తుంది.

6. వేప నూనె, షాంపూ

కావలసినవి:

 • వేప నూనె - 5 గ్రాములు
 • షాంపూ - తగినంత

ఉపయోగించే విధానం :

 • వేపగింజల నూనె 5 గ్రాములు తీసుకుని దీనితో పాటు సమానంగా షాంపూ కూడా కలిపి తలకు పట్టించాలి.
 • 10 నిమిషాల తరువాత తల స్నానం చేయాలి.
 • వేపనూనె పేలను నాశనం చేయడంలో అద్భతంగా పనిచేస్తుంది.

English summary

How to remove Ticks. You have ticks then follow 6 home remedies. Garlic is most powerful remedy to remove ticks.