వైట్ హెడ్స్ తొలగించటానికి ప్యాక్స్

How to remove Whiteheads

06:43 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

How to remove Whiteheads

వైట్ హెడ్స్ అనేవి నూనె, సిబం, మృత కణాలు, ధూళి మరియు బాక్టీరియా చర్మం రంధ్రాల లోపల చిక్కుకొన్నప్పుడు ఏర్పడే మొటిమల రకం. వైట్ హెడ్స్ శరీరంలో ఎక్కడైనా కనిపించవచ్చు. కానీ సాదారణంగా వైట్ హెడ్స్ ఎక్కువగా ముఖం, గడ్డం మరియు ముక్కు మీద వస్తూ ఉంటాయి. వైట్ హెడ్స్ ప్రధానంగా ముఖం మరియు జిడ్డు గల భాగాలపై, చర్మం ఉపరితలం పై చిన్న తెల్లని గడ్డలుగా కనిపిస్తాయి. యుక్తవయస్సులో  వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ వయస్సులోనైన రావచ్చు. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రెండూ ముక్కు మరియు ముఖం యొక్క ఇతర భాగాలలో వస్తాయి. వీటిని మందులతో కాకుండా సహజ పదార్దాలతో నయం చేసుకోవచ్చు.

వైట్ హెడ్స్ రావటానికి కారణాలు

వైట్ హెడ్స్ ని ఇంటి నివారణలు మరియు సహజ నివారిణులతో నయం చేసుకోవటానికి ముందు అవి ఎలా వస్తాయో తెలుసుకోవాలి. సిబం గ్రీవములో ఇరుక్కుపోయినప్పుడు వస్తాయని తెలుసు. అయితే చర్మ రంద్రాలకు అడ్డంకులు ఎందుకు ఏర్పడతాయో కారణాలు తెలుసుకుందాం.

1. హార్మోన్ల మార్పులు యుక్తవయస్సు, ఋతుస్రావం, గర్భం మరియు మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల కారణంగా వైట్ హెడ్స్ ఏర్పడతాయి. హార్మోన్ల మార్పులు జరిగే సమయంలో సిబం ఎక్కువగా స్రవించటం వలన వైట్ హెడ్స్ ఏర్పడతాయి. ఇవి పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా వస్తాయి.

2. కొన్ని మందులు

హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేసే కుటుంబ నియంత్రణ మాత్రల వంటి కొన్ని మందుల వలన వైట్ హెడ్స్ మరియు మోటిమలు ఏర్పడతాయి.

3. ఆండ్రోజెన్ హార్మోన్ పెరుగుదల

పురుష సెక్స్ హార్మోన్ ఆండ్రోజెన్ పురుషులు మరియు మహిళలలో వేర్వేరుగా ఉంటుంది. హార్మోన్ పునఃస్థాపన చికిత్స లేదా మొనోఫాజ్ కారణంగా మహిళల్లో ఆండ్రోజెన్ హార్మోన్ పెరుగుదలతో వైట్ హెడ్స్ మరియు మొటిమలు వస్తాయి.

4. వంశపారంపర్యం

సిబం ఉత్పత్తి వంశపారంపర్యం  మరియు జన్యువుల కారణంగా నియంత్రించబడుతుంది. జన్యువులు మరియు హార్మోన్లు చర్మంను మరింత సున్నితంగా చేయవచ్చు. ఇటువంటి వారు ఎక్కువగా వైట్ హెడ్స్ కి గురి అయ్యే అవకాశం ఉంది.

5. మేకప్ మరియు సౌందర్య సాధనాలు ఉపయోగించటం

మేకప్ మరియు సౌందర్య సాధనాలను ఎక్కువగా వాడుట వలన చర్మ రంద్రాలకు అడ్డుపడి వైట్ హెడ్స్ మరియు మొటిమలు రావటానికి కారణం అవుతుంది.

1/15 Pages

ఇక్కడ వైట్ హెడ్స్ తొలగించటానికి సహజమైన పదార్ధాలను ఉపయోగించి 14 శక్తివంతమైన ఇంటి నివారణలు ఉన్నాయి.

1. గందం పేస్ట్

అనేక చర్మ వ్యాధులకు గందం పేస్ట్ మరియు గందం నూనెను ఉపయోగిస్తున్నారు. అనేక శతాబ్దాలుగా గందం పేస్ట్ ను ప్రకాశవంతమైన మరియు అందమైన చర్మం కోసం స్త్రీలు ఉపయోగిస్తున్నారు. ఇది చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఒక ప్రసిద్ద చెందిన పదార్ధంగా  మారింది. గంధపు సువాసన మరియు చల్లని ఉపశమన టోనర్ గా పనిచేస్తుంది. దీనిలో  ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఉండుట వలన చర్మ రంధ్రాల నుండి అదనపు నూనెను తీసేసి వైట్ హెడ్స్ రాకుండా నివారిస్తుంది.

ఒక స్పూన్ గందం పొడి, రెండు స్పూన్ల రోజ్ వాటర్ కలిపి పేస్ట్ గా చేసి ముఖానికి రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో కడగాలి. మంచి పలితాలను పొందటానికి వారంలో ఈ విధంగా 2 లేదా 3 సార్లు చేయాలి.

English summary

Whiteheads may appear anywhere in the body, but they are more commonly seen on the face, chin and nose. You follow these face packs then you get smooth and fair skin