చెవి ఇన్ఫెక్షన్ కోసం సహజమైన చిట్కాలు

How to treat ear infection

10:50 AM ON 26th January, 2016 By Mirchi Vilas

How to treat ear infection

మధ్య చెవిలో బాక్టీరియా లేదా వైరస్ కారణంగా చెవి అంటువ్యాధులు అనేవి వస్తాయి. చెవి అంటువ్యాధులు ఎక్కువగా చిన్న పిల్లల్లో వస్తూ ఉంటాయి. చెవి అంటువ్యాధులు రావటానికి గులిమి ఏర్పడుట, ఎగువ శ్వాసకోశ అంటువ్యాధులు, ఆహార అలెర్జీ, పర్యావరణ అలెర్జీలు, గర్బస్థ దశలో ఆల్కహాల్ సిండ్రోమ్, జన్యుశాస్త్రం, పోషక లోపాలు మరియు అంతర్గత గాయాలు కారణాలుగా ఉన్నాయి. చెవి ఇన్ఫెక్షన్ తో బాధపడేవారికి చెవి నొప్పి,చెవి వద్ద లాగినట్లుండుట,నిద్ర లేమి,తలనొప్పి, శబ్దాలు సరిగ్గా వినపడకపోవటం, అధికజ్వరం, చెవి నుండి ద్రవం కారుట, వాంతులు, అతిసారం వంటి సాదారణ లక్షణాలు ఉంటాయి.

చెవి బయటి, మధ్య మరియు లోపలి చెవి అనే మూడు బాగాలుగా ఉంటుంది.

ఒక వ్యక్తి వినటానికి ప్రతి బాగం నిర్దిష్ట విధులను నిర్వహిస్తుంది. బయటి చెవి ఆకు లాంటి ఆకారంలో ఉండి ధ్వని తరంగాలను సంగ్రహిస్తుంది. చెవి బయటి భాగంలో విస్తరించిన భాగము మరియు ధ్వని తరంగాలు చెవి కెనాల్ లోకి ఈ విభాగం ద్వారానే ప్రవేశిస్తాయి. చెవి కెనాల్ ద్వారా ధ్వని తరంగాలు మధ్య భాగంలో ఉన్న కర్ణభేరికి చేరుకుంటాయి. చెవి మధ్య విభాగంలో  సుత్తి, దాగిలి, అర్థచంద్రాకార స్టిర్రప్ మరియు మధ్య కెనాల్ వంటి ముఖ్యమైన చెవి అవయవాలు ఉంటాయి. కెనాల్ నుంచి ధ్వని తరంగాలు చెవి లోపలి విభాగంలోకి ప్రయాణిస్తాయి. చెవి లోపలి భాగంలో కోక్లియా, యూస్తాచియన్ ట్యూబ్ వంటి ముఖ్యమైన చెవి భాగాలు మరియు నరములు ఉంటాయి. కెనాల్ నుండి ధ్వని తరంగాలు నరాలకు వెళ్ళితే మెదడు ధ్వని ప్రాసెస్ ని చేస్తుంది. ఆ తరువాత మనం ధ్వనిని గుర్తించి దానిని అర్థం చేసుకోగలం.

చెవి ఇన్ఫెక్షన్ అనేది మూడు బాగాల్లో ఎక్కడైనా సంభవించవచ్చు. లోపలి చెవిలో ఇన్ ఫెక్షన్ వస్తే చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్యలను నిరోధించడానికి చెవి ఇన్ఫెక్షన్ చికిత్స చేయకపోతే కర్ణభేరి చిల్లుపడుతుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే చెవి ఇన్ఫెక్షన్ దీర్ఘ కాలంగా ఉండి చెముడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక వైద్యుడుని సంప్రదించటం చాలా  ముఖ్యం. అయితే  తక్షణ ఉపశమనం కోసం  కొన్ని సహజ చికిత్సలను ప్రయత్నించవచ్చు. చెవి ఇన్ఫెక్షన్, నొప్పి మరియు ఇతర లక్షణాలను వదిలించుకోవటానికి సాధారణ మరియు సులభమైన ఇంటి నివారణలు ఉన్నాయి.

1/10 Pages

1. ఉప్పు

ఉప్పు అనేది ఎక్కువగా అందుబాటులో ఉండే ఇంటి నివారిణి.

* ఒక కప్పు ఉప్పును పాన్ లో వేసి తక్కువ మంట మీద కొన్ని నిముషాలు వేడి చేయాలి. లేకపోతే మైక్రోవేవ్ లేదా డబుల్ బాయిలర్ లో వేడి చేయవచ్చు.
* ఒక వస్త్రం మీద వేడి చేసిన ఉప్పును వేసి ప్రారంభం మరియు ముగింపును రబ్బరు బ్యాండ్ లేదా దారం సాయంతో ముడి వేయాలి.
* ఈ వస్త్రాన్ని ప్రభావిత ప్రాంతంలో పది నిముషాలు ఉంచాలి.
* ప్రతి రోజు ఎన్ని సార్లు అయినా చేయవచ్చు. ఉప్పు నుండి ఉత్పన్నమైన వేడి కారణంగా  చెవి నుండి ద్రవం బయటకు రాకుండా ఉండటం మరియు వాపు, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ప్రత్యామ్నాయంగా, పైన వివరించిన పద్ధతిలో ఒక కప్పు అన్నంను కూడా ఉపయోగించవచ్చు.

English summary

Here are the home remedies for ear infection. Some common signs that someone is suffering from an ear infection are pain in the ear, tugging at the ear, difficulty sleeping, poor response to sounds, high fever, fluid draining from the ear, headache