గొంతు నొప్పి ఉపశమనానికి టీ

How to treat sore throat

02:40 PM ON 27th January, 2016 By Mirchi Vilas

How to treat sore throat

శీతాకాలంలో గొంతు నొప్పి రావటం అనేది సహజంగానే జరుగుతుంది. నోటి చివర నుంచి అన్నవాహిక దాకా ట్యూబ్ ఉంటుంది. ఈ ట్యూబ్ ఎర్రబడితే గొంతు నొప్పి వస్తుంది. ఈ గొంతు నొప్పి చాలా బాధకరంగాను మరియు ఆహారాన్ని మింగటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అసలు ముందుగా గొంతు నొప్పి రావటానికి గల కారణాలను తెలుసుకుందాం.

గొంతు నొప్పి రావటానికి కారణాలు

మనకు తరచుగా జలుబు, దగ్గు వచ్చినప్పుడు గొంతు నొప్పి రావటం సహజమే. గొంతు నొప్పి రావటానికి అనేక అంశాలు కారణం అవుతాయి. తలనొప్పి, జలుబు మరియు కడుపు నొప్పి వంటివి కారణం కావచ్చు. అయితే ఇంకా ప్రధాన కారణాలు ఉన్నాయి.

 • ఆమ్ల ప్రతిచర్య
 • మితిమీరిన ధూమపానం
 • బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్
 • వైరల్ ఇన్ఫెక్షన్స్
 • చికాకు మరియు గాలిలో అలెర్జీ కారకాలు
 • ఆహార సున్నితత్వం

గొంతు నొప్పి చికిత్సకు మార్గాలు

పిల్లలు, యువకులు,పెద్దవారు అందరికి గొంతు నొప్పి చికిత్సకు అనేక మార్గాలు ఉన్నాయి. గొంతు నొప్పి చికిత్సకు సాదారణంగా ప్రతి ఒక్కరు మొదటగా OTC మందులు వేసుకోవటం లేదా డాక్టర్ ని సంప్రదించటం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ, గొంతు నొప్పి నివారణకు మూలికా మరియు గృహ నివారణలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. గొంతు నొప్పి ఉపశమనానికి కొన్ని రకాల టీలను ఉపయోగించవచ్చు. ఈ వెచ్చని పానీయాలు గొంతు నొప్పి నుండి ఉపశమనాన్నికలిగిస్తాయి.

ఈ టీలు గొంతుకు ఎలా ఉపశమనం కలిగిస్తాయి

మూలికా టీలు త్రాగటం వలన ఎర్రబడిన గొంతు చికిత్సలో సహాయపడతాయి. అలాగే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గటానికి కూడా సహాయపడతాయి. అయితే కొన్ని రకాల మూలిక టీలు గొంతులో భారము, చికాకు మరియు  తిమ్మిరి కలిగించవచ్చు. అంతేకాక ప్రతి ఒక్కరికి ఈ మూలిక టీలు త్రాగటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందటానికి ఇక్కడ చెప్పుతున్న మూలికా టీలను ప్రయత్నించండి.

1/10 Pages

1. దాల్చిన చెక్క టీ

దాల్చిన చెక్క వివిధ దేశీయ వంటకాల్లో ఉపయోగించే ఒక మసాలా దినుసు. ఇది ఉత్తేజితమైన వాసనను కలిగి గొంతు నొప్పి తగ్గటంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కతో పాటు తేనెను ఉపయోగిస్తే గొంతుకు ఓదార్పు ప్రభావం ఎక్కువగా
ఉంటుంది.

కావలసినవి

 • పాలు - ఒక కప్పు
 • దాల్చిన చెక్క - కొన్ని ముక్కలు
 • అల్లం - చిన్న చిన్న ముక్కలు లేదా పొడి
 • తేనె - ఒక స్పూన్

పద్దతి

 • పాలలో అల్లం మరియు దాల్చిన చెక్క ముక్కలు వేసి మరిగించాలి. ఆ తర్వాత తేనెను కలపాలి. ఈ టీని ఎప్పుడైనా త్రాగవచ్చు. అయితే రాత్రి పడుకొనే ముందు త్రాగితే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆవు పాలు పడని వారు  బాదం లేదా కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు.

English summary

Here are the some health tips of teas. Using these tea then you get rid of sore throat. A sore throat can be caused by a number of factors and sometimes, it is accompanied by conditions like a headache, cold and stomach ache.