గుండెమంటకు ఉపశమనం

How to use backing soda for Heartburn

04:50 PM ON 27th November, 2015 By Mirchi Vilas

How to use backing soda for Heartburn

చాలామంది ఎసిడిటి తో బాధపడుతూ ఉంటారు. అమెరికన్‌ కాలేజికి చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజీ వారి ప్రకారం నెలకి 60 మిలియన్ల అమెరికన్లు ఈ రుగ్మతతో బాధపడుతున్నారని వెల్లడయింది. కడుపులో ఉండే యాసిడ్ వలన ఈ రుగ్మత కలుగుతుంది. ఇది సాదారణ స్టమక్‌ డిజార్డర్‌ .ఇది రొమ్ము ఎముక వెనుక భాగంలో మంటను కలుగజేస్తుంది.ఇది అపాయకరమైనది కాదు అప్పుడప్పుడు సాధారణంగా అందరిలో జరుగుతూనే ఉంటుంది. కాని అపాయం కాదు అని వదిలేయడం వలన అది పెద్ధ ప్రమాదకరంగా మారి తరుచూ మిమల్ని బాధకు గురిచేస్తుంది. మీరు గుండె మంటతో భాదపడే వారైతే నిరాశ చెందకండి. సులభంగా ఈ భాదనుండి విముక్తి పొందేందుకు బేకింగ్‌ సోడా ఒక అద్బుతమైన నివారణ. ఈ రుగ్మతకు గురైన వారు కలత చెందకుండా ఈ కింది పద్దతులను పాటించడం ద్వారా ఉపసమనం లభిస్తుంది.

బేకింగ్‌ సోడా ప్రయోజనాలు:

గుండెల్లో మంటకు బేకింగ్‌ సోడా చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. కేకులలో, పేస్ట్రీలలో మొదలగు వాటిలో బేకింగ్‌ సోడాని వాడడం వలన మంచి ఫలితం ఉంటుంది. వాటిని తింటూ ఎంజాయ్‌ చేయడంతో పాటు మీ గుండె మంట లేకుండా చేస్తుంది. ఈ రుగ్మత కలిగిన వారు బేకింగ్‌ సోడా ఉపయోగించడం వలన ఆహారాలను ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా తినొచ్చు.

కడుపులో విడుదలయ్యే యాసిడ్‌ ని న్యూట్రలైస్ చేస్తుంది:

బేకింగ్‌ సోడా ఆల్కలీన్ స్వభావం కలిగి ఉండడం వలన కడుపులో విడుదలయ్యే యాసిడ్‌ని బ్యాలెన్స్‌ చేసి అదేవిధంగా గుండెమంటను నివారిస్తుంది.

యాంటాసిడ్‌ లా పనిచేస్తుంది:

బేకింగ్‌సోడా సోడియమ్‌ బైకార్బోనేట్‌ ఉండడం వలన ఇది యాంటాసిడ్‌ మందులాగా పనిచేస్తుంది. కడుపులో ఉండే యాసిడ్ తిరిగి అన్నవాహిక లోకి వెళ్ళకుండా నిరోధిస్తుంది. ఈ క్రమంలో ఛాతి మరియు గొంతుమంట నుండి ఉపసమనం లభించేలా చేస్తుంది.

పిహెచ్‌ స్థాయి సమతుల్యత:

బేకింగ్‌సోడా ని వాడడం వలన రక్త ప్రవాహంలో పిహెచ్‌ స్థాయిని సమతుల్యం చేస్తుంది. గుండె మంటకి కారణమవుతున్న కడుపులో విడుదలయ్యే యాసిడ్‌ ను తగ్గిస్తుంది. ఈ విధంగా బేకింగ్‌ సోడావల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

బేకింగ్‌ సోడా ఉపయోగించే విధానం

దీన్ని ఉపయోగించేటప్పుడు వేరొక వాటితో కలిపి ఉపయోగించవచ్చు. ఉదాహరణకి తేనె, నిమ్మరసం మెదలగునవి. ఈవిధంగా వాడడం వలన ఈ రుగ్మత నుండి ఉపసమనం లభిస్తుంది. ఏ విధంగా వాడాలో కొన్ని పద్ధతులను చూద్దాం.

బేకింగ్‌సోడా మరియు మంచి నీళ్ళు:

ఇది చాలా అద్బుతమైన సులువైన పద్ధతి. దీన్ని వాడడం వలన మంట నుండి వెంటనే ఉపసమనం పొందవచ్చు.

కావలసినవి:

బేకింగ్‌ సోడా - 1 టీస్పూన్‌

నీళ్ళు - 1 గ్లాసు.

తయారుచేయు పద్ధతి:

  • ఒక గ్లాసు నీరు తీసుకొని అందులో 1 టీస్పూన్‌ బేకింగ్‌ సోడాకలపాలి. బాగా సోడా కరిగేంత వరకు కలిపి తర్వాత తాగాలి దానివల్ల మంట తగ్గుతుంది.

గమనిక: ప్రక్రియను రోజుకి కేవలం 2 లేదా 3 సార్లుచేయాలి. 3 సార్లు మించి చెయ్యరాదు.అదేవిధంగా ఇది ఈ పద్దతిని ఒక వారానికి మించి చేయరాదు. ఉప్పుగుణం కలిగిన బేకింగ్‌ సోడా వలన సైడ్‌ ఎఫెక్ట్స్ కలగుతాయి. వాంతులు, వికారం మొదలగునవి సంభవిస్తాయి.

బేకింగ్‌ సోడా మరియు నిమ్మరసం:

నిమ్మకాయ సామాన్యంగా అందరి ఇంట్లోను ఉంటుంది. అందువల్ల ఈ రెమెడీ అందరికీ అందుబాటులో ఉండే చక్కని పద్ధతి. నిమ్మరసం గుండెమంటను తగ్గించడంలో సహాయ పడుతుంది.

కావలసినవి:

బేకింగ్‌ సోడా-1/2 టీ స్పూన్‌

నిమ్మరసం- కొన్ని చుక్కలు

వేడినీళ్ళు- 1/2 కప్పు.

తయారుచేయు పద్ధతి:

  • సగం కప్పు నీళ్ళు తీసుకొని అందులో 1/2 టీ స్పూన్‌ బేకింగ్‌ సోడా కలిపి, నిమ్మరసం కూడా కలపాలి.
  • అన్నింటిని బాగా కలిసేవిధంగా కలిపి దాన్ని సేవించడం ద్వారా గుండెమంటని అరికడుతుంది.

బేకింగ్‌ సోడా మరియు అల్లం:

బేకింగ్‌ సోడా వాడడం వలన చల్లని ఉపసమనం లభిస్తుంది. కాని అల్లం గుండె మంటని అరికడుతుంది అని మీరు ఆలోచించలేదు కదూ..! అనాది కాలం నుండి అల్లం వాడుతున్నారు. దీనిలో అద్బుతమైన ఔషదగుణాలు ఉన్నాయి. ఇది జీర్ణవ్యవస్థకు సంబంధించిన వ్యాదులను అరికట్టి జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేలాగా చూస్తుంది. అల్లంలో రెండు ఆక్టివ్‌ మూలకాలు ఉన్నాయి. ఒకటి జింజరల్‌, రెండవది షోగల్‌ ఇవి గ్యాస్ట్రిక్‌ సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి. దీన్ని వాడడం వలన కడుపులో చికాకుగా ఉన్నా, సరిగా ఆహారం అరగకపోయినా ఇది చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

కావలసినవి:

బేకింగ్‌ సోడా -1/2 కప్పు

తరిగిన అల్లం -1/2 కప్పు

వేడినీళ్ళు -1 కప్పు

తయారుచేయు పద్ధతి:

  • ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో బేకింగ్‌ మరియు అల్లం కలపాలి
  • అన్నిటిని కరిగే విధముగా బాగా కలపి తాగాలి.
  • దీన్ని తాగడం వలన గుండెల్లో మంట తగ్గుతుంది.

బేకింగ్‌ సోడా మరియు చల్లని పాలు:

చల్లని పాలు కడుపు మరియు అన్నవాహిక మధ్య ఉన్న వాల్వ్‌ ని వదులు చేస్తుంది. దాని వల్ల గుండెమంట నుండి ఉపసమనం లభిస్తుంది.

కావలసినవి:

బేకింగ్‌ సోడా -1 కప్పు

చల్లని పాలు - 1 గ్లాసు.

తయారుచేయు పద్ధతి:

  • ఒక టీ స్పూన్‌ బేకింగ్‌ సోడా ని ఒక గ్లాసు పాలల్లో కలపాలి.
  • బేకింగ్‌ సోడా బాగా కలిసే విధంగా కలిపి తరువాత తాగాలి.
  • తరుచూ వచ్చే ఈ సమస్యని ఈ చిట్కా తగ్గిస్తుంది.

ఎవరు బేకింగ్‌ సోడాని వాడకూడదు?

  • బేకింగ్‌ సోడా గుండె మంటని తగిస్తుంది కాని ఇది అదేపనిగా వాడకూడదు. ఇలా వాడడంవలన దుష్ప్రభావాలకు దారి తీస్తుంది.
  • ఉప్పు తక్కువగా సేవించవలసిన వారు దీన్ని వాడకూడదు. ఎందుకంటే బేకింగ్‌ సోడాలో సోడియం ఎక్కువగా ఉంటుంది.
  • గర్బిణీ స్త్రీలు, బాలింతలు ఈ బేకింగ్‌ సోడాని వాడకూడదు.
  • 6 సంవత్సరాల లోపు పిల్లలు బేకింగ్‌ సోడాని వాడరాదు.
  • గుండె మంటతో బాధపడేవారు మరీ ఎక్కువగా ఈ పద్ధతులని అనుసరించరాదు. ఎందుకంటే దీంట్లో ఉప్పుశాతం ఎక్కువగా ఉండడంవలన అనేక దుష్బ్రభావాలు సంభవిస్తాయి. వాంతులు, వికారంగా ఉండడం ఇలాంటి రుగ్మతలకు లోనవుతారు. కనుక అతిగా సేవించడం మంచిది కాదు.

అదనపు చిట్కాలు:

  • ఎటువంటి ఆహారం తీసుకుంటే ఇలాంటి రుగ్మతలు సంభవిస్తాయో క్లుప్తంగా తెలుసుకొని అనుసరించాలి. ఉదాహరణకు పుల్లని పళ్ళు మరియు జ్యూస్‌లు, ఉల్లిపాయ, టమోటా, కొవ్వు పదార్ధాలు, చాక్లెట్‌, కాఫీ మొదలగునవి ఎసిడిటీ కి కారణమవుతాయి. అందువల్ల అలాంటి పదార్ధాలను ఎక్కువగా తీసుకోరాదు.
  • మీరు తినే ఆహరాన్ని బాగా నమిలి మింగాలి. అలా కాకుండా కంగారుగా ఎలాపడితే అలా నమిలేసి తినడం వలన సరిగా అరగక ఎసిడిటి కి దారి తీస్తుంది.
  • అధిక మోతాదులో నీటిని తాగాలి దానివల్ల మనం తీసుకున్న ఆహారం చక్కగా అరుగుతుంది.
  • మత్తుపానియాలకు దూరంగా ఉండాలి అలాగే పొగతాగడం మానుకోవాలి.
  • వదులుగా ఉన్న దుస్తులు ధరించాలి.
  • వత్తిడిని దరిచేరనివ్వకూడదు. ఇది కూడా ఎసిడిటి కి దారితీస్తుంది.
  • అప్పడప్పుడు వచ్చే మంటకి వాడవచ్చు కాని ఇదే అలవాటు చేసుకోకూడదు. ఒక వేళ రోజు ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించాలి.
  • తరచూ ఛాతి లో నొప్పి, మంట వచ్చినట్లయితే సమయం వృధా చేయకుండా డాక్టర్‌ని కలిసి తగు జాగ్రత్తలు తీసుకోండి. తగ్గిపోతుందిలే అని వదిలేసారో అది చాలా పెద్ధ సమస్యగా మారుతుంది.

English summary

How to use backing soda for Heartburn. Do not worry if you are a victim of heartburn. There is one wonder remedy called backing soda