రక్త హీనత దూరం కావాలంటే బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్

How to use blackstrap molasses for anemia

10:42 AM ON 19th March, 2016 By Mirchi Vilas

How to use blackstrap molasses for anemia

ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది రక్తంలో ఐరన్ లోపం కారణంగా రక్త హీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే రక్త హీనతను మందుల ద్వారా,ఆహారంలో మార్పులు చేసుకోవటం ద్వారా సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. రక్త హీనత ఉన్నవారు డాక్టర్ సలహాతో ఆహారంలో మార్పులు చేసుకోవచ్చు. అలాగే చక్కెర సిరప్ యొక్క చివరి బాష్పీభవన పాయింట్ నుండి తయారుచేసిన బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ రక్త హీనతకు  అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ లో ఖనిజాలు మరియు విటమిన్లు, ఐరన్ సమృద్దిగా ఉంటుంది. ఇప్పుడు రక్త హీనతకు బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.

1/11 Pages

1. బేక్ చేసిన ఆహారాల్లో చేర్చాలి

ఆహారంలో ఆరోగ్యకరమైన బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ చేర్చటం చాలా సులభం మరియు రుచికరం అని చెప్పవచ్చు. చేదు రుచి కలిగిన బ్లాక్ స్ట్రాప్ మొలాసిస్ నిఉపయోగించి రొట్టెలు మరియు మఫిన్లను సిద్దం చేసుకోవచ్చు. ఆహారంలో చేర్చితే రక్త హీనతను ఎదుర్కోవటానికి అవసరమైన అన్ని పోషకాలు మన శరీరానికి అందుతాయి.

English summary

Black strap molasses, which is prepared from the final boiling of sugar syrup, is an excellent source of minerals and vitamins. It is high in iron and hence including it your diet routine could be beneficial in dealing with anemia.