బరువు తగ్గించటానికి తేనే మరియు దాల్చిన చెక్క

How to use cinnamon and honey for heavy weight loss

09:50 AM ON 4th January, 2016 By Mirchi Vilas

How to use cinnamon and honey for heavy weight loss

సాదారణంగా ప్రతి ఒక్కరు అందంగా మరియు ఆకర్షణీయముగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం మన శరీరం మంచి షేప్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అటువంటి మంచి షేప్ సాదించాలంటే అదనంగా ఉన్న కేలరీలను ముందుగా కరిగించుకోవాలి.

నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరు బరువు తగ్గించుకోవటానికి ఆహార ప్రణాళికలు, మందులు, వ్యాయామాలు లేదా కొన్ని సార్లు  ప్రమాదకరమైన శస్త్రచికిత్సల వంటి వాటితో బరువు కోల్పోవటానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ, మనం  బరువు సమర్ధవంతంగా కోల్పోవడం కొరకు తేనె మరియు దాల్చిన చెక్క తో కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. ఇవి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సమర్థవంతముగా మరియు సులభంగా ఉంటాయి. ఈ నివారణలు బరువు కోల్పోవటానికి సమర్ధవంతంగా పనిచేస్తాయి. తేనె మరియు దాల్చిన చెక్క బరువు తగ్గించటంలో సహాయం చేస్తాయి తేనే మరియు దాల్చిన చెక్కలో బరువు కోల్పోవటానికి సహాయపడే అనేక లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు బరువు కోల్పోవటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

1/8 Pages

తేనే బరువు తగ్గటానికి ఎలా సాయం చేస్తుందో తెలుసుకుందాం.

1. కొవ్వును కరిగించుట

తేనెలో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండుట వలన కొవ్వు కరగటమే కాకుండా శక్తి స్థాయిలు కూడా పెరుగుతాయి. కాలేయంలో గ్లూకోజ్ ఎక్కువగా తయారుకావటానికి తేనే సహాయపడుతుంది. ఇది క్రమంగా మెదడులో చక్కెర స్థాయిలు అధికంగా ఉండేలా చేస్తుంది. ఈ విధానంలో కొవ్వును కరిగించే హార్మోన్లు ఉత్పత్తి అయ్యి బరువు తగ్గటంలో సహాయపడతాయి.

2. జీవక్రియ

తేనెలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు మరియు జీవక్రియ సహాయపడే 22 అమైనో ఆమ్లాలు ఉండుట వలన  కొవ్వు మరియు కొలెస్ట్రాల్ జీవక్రియకు సహాయపడి బరువు తగ్గటంలో సహాయపడుతుంది.

3. ఆరోగ్యకరమైన గ్లైసెమిక్ సూచిక

తేనే ఒక ఆరోగ్యకరమైన గ్లైసెమిక్ సూచిక ఉన్న ఆహారం అని చెప్పవచ్చు. దీనిని తీసుకోవటం వలన శరీరంలో చక్కెర శాతం ఉండదు. అలాగే శరీరంలో కూడా తొందరగా శోషణ జరుగుతుంది.

4. ఆకలిని నిరోధిస్తుంది

తేనే తీసుకోవటం వలన శరీరంలో ఆకలిని నియంత్రించే హార్మోన్స్ ని ప్రేరేపిస్తుందని కొన్ని పరిశోదనల్లో తేలింది. దాని పలితంగా తక్కువ ఆకలి అనుభూతి కలిగి తక్కువ ఆహారం తీసుకుంటాం. దాంతో క్రమంగా బరువు తగ్గటమే కాక
బరువు పెరుగుటను కూడా నిరోదిస్తుంది.

5. జీర్ణ ప్రక్రియకు సహాయపడుతుంది

తేనెలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన జీర్ణ ప్రక్రియ సాఫీగా జరగటానికి సహాయం మరియు జీర్ణ ప్రక్రియలో బాక్టీరియాను చంపటానికి సహాయపడుతుంది. అందువలన తేనెను వాడితే బరువు తగ్గటాన్ని ప్రోత్సహిస్తుంది.

English summary

There are many properties in honey and cinnamon that help you to lose weight. Let’s find out those properties, which will make the following weight loss remedies more convincing.