హెచ్‌పీ నుంచి హై ఎండ్ ల్యాప్‌టాప్‌లు

HP launches High End Laptops

06:25 PM ON 7th January, 2016 By Mirchi Vilas

HP launches High End Laptops

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ హెచ్‌పీ హై ఎండ్ ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరించింది. లాస్‌వెగాస్ కన్‌జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో-2016లో వీటిని ప్రదర్శించింది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లకు ఇవి లభ్యం కానున్నాయని ఆ సంస్థ తెలియజేసింది.

హెచ్‌పీ ఎలైట్ బుక్ ఫోలియో..

ఈ ల్యాప్ టాప్ ధరను సుమారు రూ.66 వేలుగా నిర్థారించింది. 12.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920*1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లు, ఇంటెల్ కోర్ ఎం వి ప్రొ ప్రాసెసర్, 128/256 ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, 8 జీబీ డీడీఆర్4 ర్యామ్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హెచ్‌పీ ఎలైట్ బుక్ 1040 జీ3..

ఈ ల్యాప్ టాప్ ధరను సుమారు రూ.80 వేలుగా నిర్ణయించింది. విండోస్ 10 ప్రొ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ కోర్ వి ప్రొ ప్రాసెసర్, డీడీఆర్4 మెమొరీ, ఫుల్ హెచ్‌డీ, క్యూ హెచ్‌డీ స్క్రీన్ రిజల్యూషన్స్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హెచ్‌పీ ఎలైట్ బుక్ 800 జీ3..

ఈ ల్యాప్ టాప్ ధరను సుమారు రూ.63 వేలుగా నిర్ణయించింది. విండోస్ 10 ప్రొ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటెల్ కోర్ వి ప్రొ ప్రాసెసర్, డీడీఆర్4 మెమొరీ, 12.5/14/15.6 ఇంచ్ డిస్‌ప్లే సైజ్‌లు, హెచ్‌డీ, ఫుల్ హెచ్‌డీ, క్యూహెచ్‌డీ, యూహెచ్‌డీ స్క్రీన్ రిజల్యూషన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హెచ్‌పీ స్పెక్టర్ ఎక్స్360

ఈ ల్యాప్ టాప్ ధరను సుమారు రూ.76 వేలుగా నిర్ణయించింది. 15.6 ఇంచ్ డిస్‌ప్లే, 3820* 2160 పిక్సల్స్ 4కె అల్ట్రా హెచ్‌డీ స్క్రీన్ రిజల్యూషన్, ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 1 టీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, మినీ డిస్‌ప్లే పోర్ట్, హెచ్‌డీఎంఐ పోర్ట్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

English summary

HP company launched 4 highend laptops laptops named HP EliteBook Folio, Spectre x360,