హెచ్‌పీ నుంచి విండోస్ 10 స్మార్ట్‌ఫోన్?

HP to Launch Windows 10 Smartphone

05:34 PM ON 30th December, 2015 By Mirchi Vilas

HP to Launch Windows 10 Smartphone

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ హెచ్‌పీ విండోస్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే స్వార్ట్ ఫోన్ ను విడుదల చేయనుంది. త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. 2016 ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కార్యక్రమంలో ఈ ఫోన్‌ను విడుదల చేసేందుకు ఆ కంపెనీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 చిప్‌సెట్, అడ్రినో 530 జీపీయూ, 2 జీబీ ర్యామ్, 5.8 ఇంచ్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 20 మెగా పిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లను కొత్తగా విడుదల చేయనున్న విండోస్ 10 స్మార్ట్‌ఫోన్‌లో అందించనున్నారని సమాచారం. అయితే దీని ధర ఎంత ఉంటుందనే విషయం త్వరలో వెల్లడికానుంది. హెచ్ పీ ఈ ఫోన్ ను విడుదల చేస్తే ఈ కంపెనీ నుంచి వచ్చే మొదటి విండోస్ ఫోన్ ఇదే కానుంది.

English summary

Hewlett-Packard(HP) electronics company to launch First Windows 10 smart phone in the year 2016