ఎన్టీఆర్‌ బెస్ట్ అన్న మరో స్టార్

Hrithik Praises NTR

12:58 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Hrithik Praises NTR

ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుపుకుంటున్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 25 వ సినిమా నాన్నకు ప్రేమతో. ఈ సినిమా టీజర్‌ చూసిన ప్రముఖులందరూ ఎన్టీఆర్‌ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రీసెంట్‌ గా ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ కుష్బు ఎన్టీఆర్‌ పై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా నాన్నకు ప్రేమతో రీలీజ్‌ కోసం ఎదురు చూస్తున్నానని కూడా చెప్పింది. ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ కూడా ఎన్టీఆర్‌ పై ప్రశంసలు కురిపించాడు. తాజాగా జరిగిన ఒక మీడియా ఈవెంట్‌ లో ఎలెక్ట్రి ఫై డాన్స్‌లు చేయ్యడంలో ఎన్టీఆర్‌ బెస్ట్‌ అని ఆయన సూపర్‌ పెర్ఫార్మర్‌ అనే ఎన్టీఆర్‌ ను ప్రశంసించాడు. యన్‌.టి.ఆర్‌ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే బాలీవుడ్‌ స్టార్స్‌తో ప్రశంసలు అందుకుని ఎన్టీఆర్‌ తన క్రేజ్‌ని మరింత పెంచుకుంటున్నాడు.

English summary

Bollywood Star Hero Hrithik Roshan Praises NTR.He said that he was best in Electrifi dance,he says that NTR is good performer also