ఆత్మాహుతి దాడి నుంచి ఇద్దరు కొడుకులతో తప్పించుకున్న హృతిక్

Hrithik Roshan Escaped From Turkey Terrorist Attack

04:09 PM ON 29th June, 2016 By Mirchi Vilas

Hrithik Roshan Escaped From Turkey Terrorist Attack

టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ తెల్లవారుజామున జరిగిన ఆత్మాహుతి దాడిలో 36 మంది మృతి చెందగా, తీవ్ర గాయాలైన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎవరి హడావుడిలో వారు ఉండగా ఒకేసారి ఎయిర్‌పోర్ట్ మొత్తం గందరగోళంగా మరిపోయింది. అరుపులు, కేకలు, తుపాకి గుళ్లతో దద్దరిల్లిపోయింది. ముగ్గురు ఉగ్రవాదులు మొదట గన్‌ఫైరింగ్ మొదలుపెట్టి కనబడిన ప్రతి ఒక్కరిపై ఫైరింగ్ చేసారు. అయితే ఇంతలో పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో ఆత్మాహుతి బాంబర్లుగా మారిపోయి తమను తామే పేల్చేసుకున్నారు.అయితే ఈ ఆత్మాహుతి దాడి నుంచి తృటిలో బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్, అతని ఇద్దరు కుమారులతో సహా తప్పించుకున్నారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో నుంచి హృతిక్ రోషన్ ఇండియాకు బయల్దేరిన కొద్దిసేపటిలోనే అక్కడ ఆత్మాహుతి దాడి జరిగింది. అయితే తమ క్షేమ సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు హృతిక్ రోషన్. దాడి విషయం తెలిసి చాలా షాక్‌కు గురయ్యానని అన్నాడు. బిజినెస్ క్లాస్ టికెట్లు దొరక్కపోవడంతో అంతకుముందే ప్రయాణించాల్సిన విమానం మిస్ అయ్యిందని, అయితే అక్కడి అధికారుల సహాయం వల్ల ఎకానమీ ఫ్లైట్ ద్వారా ఇండియాకు క్షేమంగా బయల్దేరగలిగామని హృతిక్ వివరించాడు. దీంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి:టర్కీలో ఉగ్ర దాడి - 50 మంది మృతి

ఇవి కూడా చదవండి:అందుకే బాహుబలిని పొడిచేసా

English summary

Bollywood Hero Hrithik Roshan and his Sons were just escaped from the Terrorist Attack in Turkey he and his sons were just left from there and Hrithik posted that he and his son's were safe and he shocked with the Terrorist attack in Turkey.