హృతిక్ - కంగనా నోటీసుల యుద్ధం

Hrithik Roshan Sends Court Notices To Kangana Ranaut

03:14 PM ON 15th March, 2016 By Mirchi Vilas

Hrithik Roshan Sends Court Notices To Kangana Ranaut

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌..నటి కంగనా, వీరిద్దరూ ప్రేమించుకుని విడిపోయినట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ విషయమై కంగనా మీడియాతో ఎప్పుడు మాట్లాడినా తన పేరును ప్రస్తావిస్తోందంటూ హృతిక్‌ కేసు వేశాడు , నోటీసులు పంపాడు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ అందరి ముందు తనకి క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై కంగనా స్పందిస్తూ, తన తరఫు వకీలుతో ఆయా చట్టాల కింద కేసులు నమోదు చేయించి హృతిక్‌కు నోటీసులు పంపింది. తాను ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎప్పుడూ హృతిక్‌ పేరు ప్రస్తావించలేదని, అలాంటప్పుడు ఇది పరువు నష్టం ఎలా అవుతుందంటూ ఆరోపించింది. ఆషికి-3 చిత్రం నుంచి హృతిక్‌ కంగనాని తప్పించాడన్న పుకార్లు రావడంతో ‘అవును. కొంత మంది మాజీ ప్రేమికులు ఇలాంటి చెత్తపనులు, పుకార్లు ఎందుకు పుట్టిస్తారో తెలీదు. అయిపోయిన విషయాల గురించి ప్రస్తావించడం నాకు నచ్చదు’. అంటూ గతంలోనే ఓ ఇంటర్వ్యూలో కంగనా స్పష్టం చేసింది. అయితే ఇందుకు హృతిక్‌ కూడా కాస్త ఘాటుగానే స్పందిస్తూ, కోపంతో కంగనాకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఇంతలా జరుగుతున్నా, ఈ విషయమై ఇద్దరి నుంచీ ఎలాంటి వివరణ లేకపోవడం విశేషం.

English summary

Bollywood Actors Kangana Ranaut and Hrithik Roshan sends court notices each other.Hrithik Roshan has accused Kangana of defamation and has asked the actress to issue an apology else he would make all her correspondence to him public.But Kangana opposed hrithik words and said thart she never spoked about hrithik roshan and she also sends notices to Hrithik Roshan.