ఆమె చివరి కోరిక తీర్చిన హృతిక్‌!!

Hritik Roshan fulfils her last deisre

05:13 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Hritik Roshan fulfils her last deisre

బాలీవుడ్‌ అందాల నటుడు హృతిక్‌ రోషన్‌ అంటే నికితా శుక్లాకి చాలా ఇష్టం ఒక్క మాటలో చెప్పాలంటే హృతిక్‌కి వీరాభిమాని. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఎందుకు చెపుతున్నామంటే ఈ అమ్మాయికి సరిగ్గా 15 సంవత్సరాలు చిన్న వయసే అయినా ఎంతో కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతోంది. ఇమె చివరి కోరిక ఏంటంటే తను చనిపోయే లోపు హృతిక్రోషన్ ని ఒక్కసారైనా కలుసుకుని మాట్లాడాలన్నది ఆమె కోరిక. జబల్‌పూర్ లోని విరాట్‌ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న నికిత కోరిక ఏంటో ఆస్పత్రి అధికారులకి తెలిసింది. 'మోహెంజో దారో' చిత్రం ఘాటింగ్‌ కోసం ఆ సిటీ కి వచ్చిన హృతిక్‌కు ఆస్పత్రి అధికారులు వెళ్లి తెలియజేశారు.

నికిత గురించి తెలుసుకున్న హృతిక్‌ వెంటనే ఆమెను కలవడానికి అంగీకరించాడు. అంతేకాదు ఘాటింగ్‌ సెట్స్‌కు నికితను తీసుకొచ్చేందుకు స్వయంగా స్పెషల్‌ అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. హృతిక్‌ని కలిసిన నికిత ఆనందానికి హద్దు లేకపోయింది తనకిష్టమైన హీరో హృతిక్‌తో మాట్లాడి చాలా ఫోటోలు దిగింది. నీకేం కాదు నువ్వు క్యాన్సర్‌ని జయిస్తావు అని హృతిక్‌ ఆమెకు ధైర్యాన్ని నూరి పోశాడు. కానీ ఆ బంగారు తల్లి మీద క్యాన్సరే జయించింది. విధి ఆడిన వింత నాటకంలో ఆమె బలైపోయింది. హృతిక్‌ని కలిసిన వారం రోజులకే కన్నుమూసింది.

English summary

Hritik Roshan fulfils Nikitha Sukhla last desire. NIkitha is big fan of Hritik Roshan she is 15 years old. But she is suffering from cancer.