కొరటాల శివ డైరెక్షన్లో 'హృతిక్ రోషన్'!!

hritik roshan in srimanthudu hindi remake

06:33 PM ON 21st November, 2015 By Mirchi Vilas

hritik roshan  in srimanthudu hindi remake

ప్రిన్స్ మహేష్ బాబుకి 'శ్రీమంతుడు'తో హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివ. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రిలీజై కాసుల వర్షం కురిపించింది. ఇటీవలే శ్రీమంతుడు 100 రోజులు పూర్తి చేసుకుందన్న విషయం మనకి తెలిసిందే. ఈ చిత్రం బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ తో రీమేక్ చేయబోతున్నారని తాజా సమాచారం. ఇప్పటికే శ్రీమంతుడు బాలీవుడ్ రీమేక్ రైట్స్ ను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ సొంతం చేసుకోగా, శ్రీమంతుడు కథను కొరటాల శివ హృతిక్ రోషన్ కి వినిపించారు. కథ నచ్చడంతో హృతిక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అయితే క్లైమ్యాక్స్లో కొన్ని మార్పులుచేర్పులు చేయమని శివని హృతిక్ కోరారట.

తెలుగులో జగపతిబాబు నటించిన పాత్రలో హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ నటించబోతున్నారట. ప్రస్తుతం హృతిక్ 'మొహంజోదారో' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ 'నాన్నకు ప్రమతో' షూటింగ్ అయిపోయాక, శివ-ఎన్టీఆర్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం అయిపోయాక హృతిక్-శివ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. తెలుగులో రెండు చిత్రాలే చేసి బాలీవుడ్ రేంజ్ కి ఎదిగిన కొరటాల శివగారిని మనం అభినందిద్దామ్.

English summary

hritik roshan in srimanthudu hindi remake