'రోబో-2'లో 'హృతిక్‌ రోషన్‌' విలన్‌??

Hritik Roshan is a villan in Robo sequel??

11:36 AM ON 17th December, 2015 By Mirchi Vilas

Hritik Roshan is a villan in Robo sequel??

దిగ్గజ దర్శకుడు శంకర్‌ తెరకెక్కించబోతున్న భారీ ప్రోజెక్ట్‌ రోబో-2లో హాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆర్నల్డ్‌ని విలన్‌గా ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రోబో-2 కోసం ఆర్నెల్డ్‌ని శంకర్ ఎక్కువ రోజులు డేట్స్‌ అడగడంతో ఆర్నెల్డ్‌ ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్‌ కండల వీరుడు హృతిక్‌ రోషన్‌ పేరు వినిపిస్తుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోగా వెలిగొందుతున్న హృతిక్‌ రోషన్‌ రోబో-2 లో విలన్‌గా నటింపజేయాలని శంకర్‌ ఆలోచన. అయితే ఈ ప్రపోజల్‌ ఇంకా హృతిక్‌ రోషన్‌ వరకు వెళ్లలేదు. ఈ విషయం తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరోపక్క రోబో-2 భారీ గ్రాఫిక్స్‌ కోసం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుతున్నారు. రజనీకాంత్‌ సరసన సెక్సీ రోబట్గా కనిపించడానికి అమీ జాక్సన్‌ ఇప్పటికే ఎంపికైన విషయం తెలిసిందే. రోబో-2 ఘాటింగ్‌ ఈ రోజే మొదలైంది. కబాలి ఘాటింగ్‌ అయిపోయాక రజనీకాంత్‌ రోబో-2 ఘాటింగ్‌ లో జాయిన్‌ అవుతారు.

English summary

Hritik Roshan is a villan in Robo sequel. Arnold is not acting in this film because of dates adjusting.