హృతిక్ ట్విట్టర్ ని దయ్యం హ్యాక్ చేసిందా?

Hritik Roshan twitter account was somebody hacked

03:44 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Hritik Roshan twitter account was somebody hacked

అవునా అంటే అవునని బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అంటున్నాడు. తన ట్విట్టర్ ఖాతాను దయ్యం హ్యాక్ చేసిందట. ఈ విషయాన్ని హృతిక్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అంటే మనోళ్లకు హారర్ సినిమాల ప్రభావం బానే పడిందా ఏమిటి? లేకపోతే దయ్యం హ్యాక్ చేయడం ఏమిటి? అసలు ఈ కధ ఏమిటో చూద్దాం. నాకు తెలీకుండానే కొన్ని ఖాతాలు అన్ ఫాలో అయిపోతున్నాయి. ఇలా జరుగుతుందా? దయ్యాలేమన్నా హ్యాక్ చేసుంటాయా అంటూ హృతిక్ ట్వీట్ చేశాడు. బహుశా హృతిక్ ట్విట్టర్ ఖాతాకే ఏదో సాంకేతిక లోపం వచ్చినట్టుంది.

తాజాగా హృతిక్ మొహెంజొదారో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పిల్లలిద్దరితో కలిసి స్పెయిన్ లో షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న హృతిక్ ఐఫా పురస్కారాల కార్యక్రమానికి హాజరుకాబోతున్నాడు.

English summary

Hritik Roshan twitter account was somebody hacked