హెచ్‌టీసీ నుంచి మరో సీడీఎంఏ ఫోన్

HTC launches new CDMA phone

05:48 PM ON 12th December, 2015 By Mirchi Vilas

HTC launches new CDMA phone

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ హెచ్‌టీసీ డిజైర్ సిరీస్‌లో కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. డిజైర్ 828 పేరిట విడులైన ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ 4జీతో పాటు సీడీఎంఏ సిమ్ లను సైతం సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఈ నెల 14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం డార్క్ గ్రే, పెరల్ వైట్ రంగుల్లో లభ్యమవుతున్న ఈ ఫోన్ ధర రూ.19,990.ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో విడుదలైన మొదటి డిజైర్ మొబైల్ ఇదే.

5.50 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, 1080*1920 పిక్సల్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్, 13 ఎంపీ వెనుక ఓఐఎస్ కెమెరా, 4 ఎంపీ ఆల్ర్టాపిక్సల్ కెమెరా విత్ బీఎస్ఐ సెన్సార్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ దీనిని 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. మొదలైన ఫీచర్లు ఉన్నాయి. 7.9 ఎంఎం మందం కలిగి ఉన్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 ఓఎస్ పై పని చేస్తుంది. సిమ్ 1 4జీ, సీడీఎంఏ, జీఎస్ఎం సపోర్ట్ చేయగా.. సిమ్ టు 3జీ, జీఎస్ఎం సపోర్ట్ చేస్తుంది. ఇందులో కంప్లీట్ డాల్బీ ఆడియోతో పాటు హెచ్ టీసీ బూమ్ సౌండ్ టెక్నాలజీని కూడా వినియోగించారు. 148 గ్రాముల బరువు మాత్రమే ఉన్న ఈ ఫోన్ లో 2800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

English summary

HTC launches a new CDMA enabled smart phone named HTC Desire 828 Dual SIM Launched in India at a Price of Rs. 19,990