మార్ష్‌మాలోతో హెచ్‌టీసీ 'వన్ ఎ9'

Htc new smart phone One 9 with marsh mellow os

04:15 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Htc new smart phone One 9 with marsh mellow os

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హెచ్‌టీసీ 'వన్ ఎ9' పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ. 29,990. డిసెంబర్ 15 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డీల్ సైట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. దీని రిజిస్ట్రేషన్లను ఇప్పటికే ప్రారంభించారు. అలాగే డిజైర్ 828 ఫోన్ భారత్ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఫోన్ ధర ఎంత ఎప్పుడు విడుదల చేస్తుందనే విషయాలను వెల్లడించలేదు.

మార్ష్ మాలో ఓఎస్ తో విడుదలవుతున్న తొలి హెచ్ టీసీ ఫోన్ వన్ ఎ9. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ విడుదల కానుంది. 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మోడల్ ను భారత్ లో విడుదల చేస్తోంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ స్టోరేజ్ ఉన్న మొబైల్ ను వేరే దేశాల్లో విడుదల చేస్తోంది.

ఇందులో 5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080X1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.5 జీహెచ్‌జడ్ సరికొత్త 64 బిట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 617 ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 4 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, మాగ్నెటిక్ సెన్సార్, 2150 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కార్బన్ గ్రే, పెరల్ సిల్వర్ కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

English summary

Htc company launched its new smart phone named Htc One 9. This phone is to come with latest Andriod Operating system Marsh Mellow Update