హెచ్‌టీసీ వన్ ఎక్స్9 వచ్చేసింది

HTC One X9: Now in the Market

07:05 PM ON 28th December, 2015 By Mirchi Vilas

HTC One X9: Now in the Market

హెచ్‌టీసీ. హైఎండ్ మొబైల్స్ రూపొందించడంలో స్పెషలిస్ట్. గత రెండు నెలల్లో రెండు కొత్త మొబైల్స్ ను తీసుకొచ్చిన ఈ ప్రఖ్యాత సంస్థ తాజాగా వన్ ఎక్స్9 పేరిట కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. దీనిని తొలుత చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధర దాదాపుగా రూ.24,400. త్వరలోనే ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

వన్ ఎక్స్9లో డ్యుయల్ సిమ్, 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080x1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 64 బిట్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (దీనిని ఎస్డీ కార్డు సహాయంతో 2 టీబీ వరకు పెంచుకోవచ్చు), 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 4కె వీడియో రికార్డింగ్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, వైఫై 802.11 ఏసీ, జి-మోషన్ సెన్సార్, కంపాస్, గైరోస్కోప్, మాగ్నెటిక్ సెన్సార్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 గంటల 3జీ టాక్‌టైం, 10 గంటల హెచ్‌డీ వీడియో ప్లేబ్యాక్, 40 గంటల ఆడియో ప్లేబ్యాక్, ఫాస్ట్ చార్జింగ్, డాల్బీ ఆడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేకపోవడం లోటే. ప్రస్తుతం గన్ మెటల్ గ్రే, సిల్వర్ కలర్స్ లో ఈ ఫోన్ లభ్యంకానుంది.

English summary

HTC new mobile one x9 is now live in the market. Company announced mobiles price and full featured specifications.