'ఎంజాయ్ 5ఎస్'తో ఎంజాయ్

Huawei launches Enjoy 5S Smart Phone

05:15 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Huawei launches Enjoy 5S Smart Phone

హువావే సంస్థ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొస్తోంది. 'ఎంజాయ్ 5ఎస్' పేరిట రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 10 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధర 1,199 యాన్స్ (సుమారు రూ. 12,500)గా నిర్ణయించింది.

ఇందులో డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720X1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా మొదలైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ వరకూ పెంచుకోవచ్చు. 2200 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. 2జీ నెట్ వర్క్ లో 420 నిమిషాల టాక్ టైమ్ అందిస్తుంది. 200 గంటల స్టాండ్ బై ఉంటుంది. ఈ ఫోన్ 4జీ నెట్ వర్క్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. కాగా, ఈ ఫోన్ గోల్డ్, సిల్వర్ కలర్స్ లో లభ్యమవుతోంది. 7 ఎంఎం థిక్ నెస్ తో 135 గ్రాముల అతి తక్కువ బరువు దీని ప్రత్యేకత. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ సౌకర్యం కూడా ఉంది. ప్రస్తుతం చైనాలో మాత్రమే లాంచ్ చేస్తున్న ఈ ఫోన్ ను మిగతా దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

English summary

Huawei launches a new android smart phone called Huawei Enjoy 5S but this phone is presently available only in china