రెండు వేరియంట్లతో హువాయ్‌ మేట్‌ 8

Huawei Mate 8 Smart Phone

06:00 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Huawei Mate 8 Smart Phone

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ హువాయ్‌ మేట్‌ 8 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసింది. అమెరికాలో జరుగుతున్న సీఈఎస్‌ 2016లో దీన్ని విడుదల చేసింది. 2 వేరియంట్లలో ఈ ఫోన్లు లభ్యమవుతుంది. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత మెమొరీతో లభ్యమయ్యే వేరియంట్‌ ధర సుమారు రూ.43,000. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మెమొరీ ఫీచర్లతో లభ్యమయ్యే వేరియంట్‌ ధర సుమారు రూ.50,000. 6 అంగుళాల ఫుల్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే, 2.5డీ కర్వ్‌డ్‌ గ్లాస్‌ కవర్‌, 1920×1080 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 16 మెగాపిక్సల్‌ కెమేరా, 8 మెగాపిక్సల్‌ ముందు కెమేరా, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 6.1 మార్ష్‌మాలో, 4జీ, బ్లూ టూత్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

English summary

Huawei Mate 8 smartphone was launched . The phone comes with the features like 6.00-inch touch screen display with a resolution of 1080 pixels by 1920 pixels