హువావే నుంచి మేట్ బుక్ ల్యాప్‌టాప్

Huawei MateBook Laptop

04:14 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Huawei MateBook Laptop

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ హువావే 2 ఇన్ 1 ల్యాప్ టాప్ ను ప్రవేశపెట్టింది. మేట్‌బుక్ పేరిట ఈ 2 ఇన్ 1 హైబ్రిడ్ విండోస్ 10 ల్యాప్‌టాప్ కమ్ టాబ్లెట్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ప్రదర్శనకు ఉంచింది. హెచ్‌జడ్-డబ్ల్యూ09, హెచ్‌జడ్-డబ్ల్యూ19, హెచ్‌జడ్-డబ్ల్యూ29ల పేరిట 3 మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. రూ.48 వేల ప్రారంభ ధరతో ఈ ల్యాప్‌టాప్ లను అందుబాటులోకి తెచ్చింది.

మేట్ బుక్ ప్రత్యేకతలు ఇవే..

12 ఇంచ్ ఐపీఎస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 2160x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఇంటెల్ కోర్ ఎం3 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్. ఇంకా మోడల్‌ను బట్టి హార్డ్‌వేర్ ఫీచర్లను పెంచుకోవచ్చు. వీటిలో ఇంకా వైఫై 802.11 ఏసీ, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా, యూఎస్‌బీ 3.0 టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

Chineese Electroincs company Huawei Launched a new Laptop cum Tablet named Huawei MateBook.This was reveled in Mobile World Congress .This lapotop comes with the key features like 3.1GHz dual-core Intel Core 6th Gen processor , 4GB RAM,128GB of internal storage,Wi-Fi, Bluetooth.