హువావే 'మేట్ 8'

Huawei New Mate 8 Smart Phone

04:06 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Huawei New Mate 8 Smart Phone

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువావే కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. 'మేట్ 8' పేరిట రూపొందించిన ఈ నూతన స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మేట్ 8 ధర దాదాపుగా రూ.31,200 కాగా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర రూ.38,500గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నర్ మెమరీ ఉన్న మోడల్ ధరను రూ. 45,800 గా నిర్ణయించారు. ఇక షాంపేన్ ఎడిషన్ ధరను రూ.71,700 గా హువావే ప్రకటించింది. చైనా కాకుండా ఇతర ప్రపంచ దేశాల్లో ఈ ఫోన్ లభ్యమయ్యే తేదీలను జనవరిలో ప్రకటించనుంది.

ఆరు అంగుళాల ఈ ఫ్యాబ్లెట్ ఫుల్ మెటల్ బాడీతో ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో తో అందుబాటులో ఉండనుంది.

ఇందులో డ్యుయల్ సిమ్ (నానో), ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1080X1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ కిసిలికాన్ కిరెన్ 950 ప్రాసెసర్, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ సోనీ సెన్సార్ తో, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ, ఎన్‌ఎఫ్‌సీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా మేట్ 8లో ఉన్నాయి.

English summary

Huawei launched its new smart phone called "Mate 8" .This phone is presently available only in china