శాటిలైట్ లోనూ 'గ్యారేజ్' టాప్ గేరే!

Huge amount for Janatha Garage satellite rights

12:55 PM ON 29th July, 2016 By Mirchi Vilas

Huge amount for Janatha Garage satellite rights

కొన్ని సినిమాలకు క్రేజ్ క్రియేట్ చేస్తుంటారు. అయితే ఒక్కో సినిమాకి అనుకోకుకుండా క్రేజ్ వస్తుంది. సరిగ్గా అదే కోవలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల వంటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'జనతా గ్యారేజ్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటించారు. సెప్టెంబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోందని తెలిసింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులను ఓ ప్రముఖ ఛానెల్ రూ.12.5 కోట్లకు దక్కించుకుందని అంటున్నారు.

ఎన్టీఆర్ గత చిత్రాలతో పోల్చితే.. ఇంత భారీ మొత్తానికి శాటిలైట్ రైట్స్ రావడం ప్రథమం అని సినీజనం అంటున్నారు. వరుస సక్సెస్ లతో కొరటాల, ఎన్టీఆర్ కున్న క్రేజ్ వల్లే భారీ స్థాయిలో ధర పలికిందని తెలుస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

English summary

Huge amount for Janatha Garage satellite rights