లెక్చరర్ల బ్యాంకు ఖాతాల్లోకి కోట్లు వేసిన కరెస్పాండెంట్.. ఆపై ఏమైందంటే..

Huge Black Money Scam Exposed in Vijayawada

02:34 PM ON 30th November, 2016 By Mirchi Vilas

Huge Black Money Scam Exposed in Vijayawada

నోట్ల రద్దు ఎఫెక్ట్ తో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, బడాబాబులు మాత్రం అన్ని మార్గాలు యోచిస్తున్నారు. ఇందుకోసం ఏ ఒక్క అవకాశం వదులుకోవడం లేదు. ఏదో రకంగా బ్లాక్ మనీని వైట్ గా మార్చేందుకు కసరత్తు చేస్తూనే వున్నారు. తాజాగా విజయవాడలో బ్లాక్ మనీ మార్పిడి కుంభకోణం ఒకటి వెలుగుచూసింది. కోట్ల రూపాయల బ్లాక్ మనీని కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్ల అకౌంట్లోకి గాంధీ మహిళా కాలేజీ కరస్పాండెంట్ డిపాజిట్ చేశాడు. ఉన్నట్టుండి డబ్బులు పడినట్లు బ్యాంక్ నుంచి మెసేజ్ రావడంతో లెక్చరర్లు ఖంగుతిన్నారు. అయితే, విత్ డ్రా ఫారాలు ఇచ్చి డబ్బును తిరిగి ఇవ్వాలని కాలేజీ కరస్పాండెంట్ కోరడంతో లెక్చెరర్లకు చిర్రెత్తుకొచ్చింది.

తమకు తెలియకుండానే డబ్బులు ఎలా వేశారంటూ లెక్చరర్లంతా నిలదీశారు. దీంతో కరస్పాండెంట్ కాంతారావు సహా మరో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ద్వారా లావాదేవీలు జరిగాయని, వివిధ అకౌంట్లలో డబ్బులు వేసినట్టు గుర్తించామని, దీనికి సంబంధించి బ్యాంకు అధికారుల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

/p>

English summary

Huge Black Money Scam Exposed in Vijayawada