బ్రెజిల్లో ఒంగోలు గిత్తకు గిరాకీ

Huge Demand For Ongole Bulls In Brazil

01:13 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Huge Demand For Ongole Bulls In Brazil

ఏదైనా మనవాళ్ళు అంతగా దృష్టి పెట్టని అపురూపమైన వాటిని విదేశాల్లో బాగా ఆదరిస్తారు. గిరాకీ విదేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మన ఒంగోలు గిత్త బ్రెజిల్‌ని దున్నేస్తోంది. ఈ గిత్తల సంఖ్య ఏపీలో 2.50 లక్షలుండగా బ్రెజిల్లో అక్షరాలా పదహారు కోట్లున్నాయి. ఇక్కడి నుంచి ఈ గిత్తలను తీసుకెళ్లిన బ్రెజిల్‌ దేశస్థులు వాటిని భారీగా అభివృద్ధి చేసుకున్నారు. వీటి వీర్యంతో బ్రెజిల్‌ ఏటా రూ.2275కోట్ల వ్యాపారం చేస్తోంది. ఈ జాతి పశువులను గత నెల 30 నుంచి ఈ నెల 8వరకు బ్రెజిల్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. బ్రెజిల్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో జెబూ, అంకుశ్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రదర్శనను ఏపీ శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు సందర్శించి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ పాడిపరిశ్రమ, ఎలా ఉందొ వివరిస్తూ, మనమూ అలాంటి వృద్ధిని సాధించాలంటే ఏం చేయాలో ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి:అక్కడ అబ్బాయిలకు అమ్మాయిలే ఖర్చు పెడతారట!

‘‘1938లో ఏపీలోని నెల్లూరు ప్రాంతం నుంచి ఒంగోలు (అప్పట్లో ఒంగోలు - నెల్లూరు ప్రాంతాలు కలిసి ఉండేదట) జాతి పశుసంపద వీర్యాన్ని తీసుకువెళ్లి అక్కడ ఈ సంతతిని వృద్ధి చేశారు. ఇప్పటికీ నెలూర్‌ జాతిగానే అక్కడ ఈ పశువులను పిలుస్తున్నారు. నెలూర్‌ పేరుతో అక్కడ కాలనీలు కూడా వెలిశాయి. మన రాష్ట్రంలో ఒంగోలు జాతి పశుసంపద 2.50లక్షలు మాత్రమే ఉంటుంది, వాటి సంతతితో అభివృద్ధి చేసిన పశుసంపద బ్రెజిల్‌లో 16కోట్లకుపైగా ఉన్నాయి. అక్కడ ఒక్కో పశుపోషకుడి వద్ద 30వేల వరకు పశువులున్నాయి. వారు ఎద్దులు, దున్నపోతుల కంటే ఆవులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఈ ఆవులు 20 నుంచి 30 లీటర్ల పాలు ఇస్తున్నాయి..అదీ కూడా రోజుకు మూడుసార్లు ఇస్తున్నాయి. ఆవులు తక్కువ ఆహారం తీసుకుని ఎక్కువ పాలు ఇస్తాయ్‌, మన వద్ద మాత్రం బర్రెల్లాంటివాటికే ప్రాధాన్యమిస్తున్నాం. ఇవి ఎక్కువ ఆహారం తీసుకుని తక్కువ పాలిస్తున్నాయి.’’ అని డాక్టర్ కోడెల పేర్కొన్నారు.‘‘50వేల వీర్యం(సిమన్లు) యూనిట్లు వారివద్ద సిద్ధంగా ఉన్నాయి. వాటిని మనకు ఇవ్వడానికీ ముందుకు వస్తున్నారు. అక్కడ, ఇక్కడి వాతావరణ పరిస్థితులు కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి కాబట్టి వాటిని ఇక్కడ వృద్ధి చేసే అవకాశం ఉంటుంది. అయితే అందుకోసం క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన సాంకేతిక శిక్షణ, పశువులకు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన రక్షణ చర్యలు వంటి అంశాలపై అవగాహన కల్పించేంలా శిక్షణ ఇవ్వాలి" అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:బల్లి శాస్త్రం ఏం చెబుతుందంటే..

ఇవి కూడా చదవండి:భార్యను చంపి సేమ్ 'దృశ్యం' సినిమా కధలా మలిచాడు

English summary

There is huge demand for Ongole Bulls in Brazil country. Ongole Bulls Sperm has been taken from ongole to Brazil and developed these bulls there. In Ongole there were 2.5 lakhs of Bulls but Surprisingly there were 16 crores of Ongole Bulls in Brazil.