'సల్మాన్' భూరి విరాళం ..

Huge Donation By Salman

03:21 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Huge Donation By Salman

డ్రంక్ డ్రైవ్ కేసు నుంచి బయటపడిన ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగం పంచ్కున్తున్నాడా ... పేదల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాడా.... అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఓ వైద్యశిబిరం నిర్వహణకు ఏకంగా రూ.2.5కోట్ల విరాళం ప్రకటించాడు. ఉత్తర మహారాష్ట్రలోని కరవు ప్రాంతమైన జల్‌గావ్‌లో ప్రజల కోసం జనవరి 9 నుంచి 12 వరకు ఈ శిబిరాన్ని తలపెట్టారు. జల్‌గావ్‌, సమీప ప్రాంతాల నుంచి సుమారు 35వేల మంది ఈ శిబిరంలో సేవలందుకుంటారని అంచనా. కేన్సర్‌ రోగుల కోసం ప్రత్యేకంగా టాటా మెమోరియల్‌ ఆస్పత్రి నిపుణులు ఈ శిబిరంలో పరీక్షలు నిర్వహించనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఈ శిబిరాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి గిరీశ్‌మహాజన్‌ తెలిపారు. . వివిధ ఫార్మా కంపెనీలు సైతం 5 ట్రక్కుల మందులను ఈ శిబిరంలో పంపిణీ చేయబోతున్నాయి. కారణం ఏదైనా ఈ శిబిర నిర్వహణకు సల్మాన్ స్పందించి భారీ విరాళం ఇవ్వడం విశేషం.

English summary

Bollywood star hero salman khan donates 2.5 crores to medical camp which was going to start by Maharastra Cheif Minister