పెద్దనోట్ల రద్దుతో శ్రీవారికి కాసుల వర్షం..!

Huge donations for Lord Venkateswara

12:19 PM ON 16th November, 2016 By Mirchi Vilas

Huge donations for Lord Venkateswara

పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే.. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారు మరింత కాసుల వర్షంతో మునిగి తేలుతున్నాడు. చిల్లర డబ్బుల కొరతతో భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ హుండీ ఆదాయం మాత్రం అధికంగా ఉంటోంది. సాధారణంగా శ్రీవారి హుండీ ఆదాయం రోజుకు సగటున రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు ఉంటుంది. అదే రద్దీ రోజుల్లో అయితే రూ.3 కోట్ల వరకు వస్తుంది. కానీ ప్రస్తుతం సీన రివర్స్ అయింది. పెద్ద నోట్లు రద్దయిన నేపథ్యంలో చాలా మంది వాటిని హుండీలో వేస్తున్నారు. కేవలం ఐదు రోజుల్లోనే హుండీ ద్వారా రూ.15.05 కోట్ల ఆదాయం లభించింది.

1/4 Pages

పెద్ద నోట్ల రద్దు ప్రకటన వచ్చినప్పటి నుంచి, చిన్న నోట్ల సమస్యతో దూరప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు రావడంలేదు. దీంతో కొండ ఖాళీగా ఉంటోంది. కేవలం రెండు గంటల్లోనే భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కానీ హుండీ ఆదాయం లెక్కలు చూస్తుంటే ముక్కుపై వేలేసుకోవాల్సి వస్తోంది. పరకామణి లెక్కింపుల్లో అన్నీ పెద్ద నోట్లే కనిపిస్తున్నాయి.

English summary

Huge donations for Lord Venkateswara