టెలికం సంస్థలకు భారీ జరిమానా!

Huge fine for Telecom companies

12:21 PM ON 22nd October, 2016 By Mirchi Vilas

Huge fine for Telecom companies

ఈ మధ్య రిలయన్స్ జియోకి అనూహ్య స్పందన రావడం తెల్సిందే. అయితే జియోతో అనుసంధానానికి నిరాకరించిన టెలికాం సంస్థలపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కొరడా ఝళిపించింది. ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాపై మొత్తం రూ.3,050 కోట్ల భారీ జరిమానా విధించాలని టెలికాం శాఖకు సిఫారసు చేసింది. మొబైల్ లైసెన్స్ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ మూడు సంస్థలు ఉల్లంఘించాడాన్ని ట్రాయ్ తీవ్రంగా పరిగణించింది. దీంతో 21 సర్కిళ్లలో రూ.50 కోట్ల చొప్పున ఎయిర్ టెల్, వొడాఫోన్ లపై తలో రూ.1,050 కోట్లు, ఐడియా సెల్యూలార్ కు 19 సర్కిళ్లలో రూ.50 కోట్ల చొప్పున రూ.950 కోట్ల జరిమాన విధించింది.

జియోతో కాల్స్ అనుసంధానం కాకుండా పై మూడు టెలికాం ఆపరేటర్లు వేధిస్తున్నాయన్న రిలయన్స్ ఫిర్యాదుతో ట్రాయ్ ఆ సంస్థలకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

English summary

Huge fine for Telecom companies