బెస్ట్ ప్రైస్ అంటుకుంది - నష్టం రూ 20 కోట్ల పైమాటే...

Huge fire accident in Best Price

02:44 PM ON 10th September, 2016 By Mirchi Vilas

Huge fire accident in Best Price

భారీ అగ్ని ప్రమాదం విజయవాడ శివార్లలోని బెస్ట్ ప్రైస్ వాణిజ్య సముదాయంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రూ. 20కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు అంచనావేస్తున్నారు. విదేశీ సంస్థ వాల్ మార్ట్ కు చెందిన బెస్ట్ ప్రైస్ ప్రమాద వివరాల్లోకి వెళ్తే.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో భవనంలోపల ఏసీలు ఉన్న విభాగంలో మంటలు చెలరేగాయి. ఆ వెంటనే ఫైర్ అలారం మోగింది. రాత్రిపూట విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో అగ్నిమాపకశాఖకు వర్తమానం అందించారు.

1/5 Pages

దీంతో ఫైర్ ఇంజన్లు హుటాహుటీన అక్కడకు చేరుకొని, మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. అయితే అప్పటికే దుకాణం మొత్తం అగ్ని కీలలు వ్యాపించాయి. 8 ఫైరింజన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. భవనం లోపలి వస్తువులు 80 శాతం పైగా కాలిపోయాయి.

English summary

Huge fire accident in Best Price. Fire accident in Vijayawada Best Price mall.