మహారాష్ట్రలో భారీ పేలుడు - 20 మంది మృతి

Huge fire accident in Maharashtra

02:49 PM ON 31st May, 2016 By Mirchi Vilas

Huge fire accident in Maharashtra

మహారాష్ట్రలో ఓ మందుగుండు సామాగ్రి డిపోలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పేలుడు సంభవించడం వల్ల ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లు సహా పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన పాల్గన్లో మంగళవారం చోటు చేసుకుంది. సైనిక ఆయుధ కర్మాగారంలో ఉదయం భారీ పేలుడు జరగడంతో అక్కడే పని చేస్తున్న వారు కాలి బూడిదయ్యారు. మరో పందొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు కారణంగా ఎగసిపడుతున్న మంటలు శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో సమీపంలోని దాదాపు వెయ్యి మంది గ్రామ ప్రజలను పోలీసులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పుల్గావ్ ఆయుధాగారంలో మంటలు, పేలుళ్లలో దాదాపు 20 మంది మరణించి, మరో 19 మంది వరకు గాయపడిన నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారు. రక్షణమంత్రి మనోహర్ పారికర్ను వెంటనే అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా కోరారు. మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ కూడా పుల్గావ్కు వెళ్ళారు. అక్కడ కాగా మంటలు అదుపులోకి వచ్చాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. అక్కడకు కావల్సిన సహాయం, వనరులు, ప్రాథమిక వైద్య సదుపాయాలు అన్నీ అందిస్తున్నామన్నారు.

ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, భారీ మొత్తంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఎంతవరకు వీలైతే అంత సాయం చేయాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

English summary

Huge fire accident in Maharashtra