సూపర్ స్టార్ మూవీ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం

Huge fire accident in Mahesh Babu movie sets

10:51 AM ON 2nd November, 2016 By Mirchi Vilas

Huge fire accident in Mahesh Babu movie sets

సినిమా షూటింగ్ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదాలు అప్పుడపుడు జరగడం తెలిసిందే. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సెట్స్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని రోడ్ నెంబర్ 87లో షూటింగ్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. యూనిట్ వేసిన టెంట్లపై దీపావళి టపాసులు పడి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ సెట్ పూర్తిగా పూర్తిగా కాలిపోయింది. నష్టం ఎంత అన్నదానిపై వివరాలు తెలియలేదు. సోమవారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.

రెండువారాల పాటు ఇక్కడే జరగనుంది. ఇంతలోనే ఇలా జరగడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ షాకయ్యారు. మహేష్ బాబు- మురుగదాస్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో యాక్షన్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం కొత్త రకం కెమెరాలతోపాటు డ్రోన్లను కూడా వాడినట్టు ఇన్ సైడ్ టాక్.

English summary

Huge fire accident in Mahesh Babu movie sets