నాచారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం

Huge Fire Accident In Nacharam Industrial Area

12:55 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Huge Fire Accident In Nacharam Industrial Area

నాచారం పారిశ్రామిక వాడలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రారిశ్రామికవాడలోని రోడ్‌ నెంబరు 18లో ఉన్న శాలిస్లైట్‌ రసాయన పరిశ్రమలో రియాక్టర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో సమీపంలోని ప్రజలు భయాందోళనతో పరుగుల తీశారు. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన ఘటనాస్థలికి చేరుకుని 10 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఘటనాస్థలిని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పరిశ్రమలోని రసాయన ట్యాంకర్లు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇవి కూడా చదవండి:అందరి ముందు హీరోయిన్ బట్టలు విప్పించిన డైరెక్టర్

ఇవి కూడా చదవండి:రూమ్ కి అమ్మాయిలని పంపిస్తే బ్యాంకు లోన్ ఇచ్చేస్తాడట

ఇవి కూడా చదవండి:కడుపులో బిడ్డ ఎందుకుతంతాడో తెలుసా ?

English summary

Huge Fire Accident occurred in Nacharam Industrial Area today. This Fire accident was occurred in Road Number 18 in Salislite Chemical Area in Nacharam Industrial Area. Greater Hyderabad Municipal Corporation Mayor Bonthu Ram Mohan and Uppal MLA Prabhakar Visited the Area.