'సర్దార్' ప్రీ-రిలీజ్ కి కాసుల పంట!!

Huge Profit for sardar Gabbar Singh Pre-Release

12:34 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Huge Profit for sardar Gabbar Singh Pre-Release

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమాను సమ్మర్‌ స్పెషల్‌ గా వచ్చే మే నెల 11న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదలవ్వడానికి చాలా రోజుల ముందే ఈ సినిమా పై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 80-90 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనాలు వేస్తున్నాయి. అయితే ఇది శాటిలైట్‌ హక్కులతో కాకుండానట. శాటిలైట్‌ హక్కులు కూడా కలిపితే ఇది ఇంకా చాలా పెరిగిపోవచ్చు. ఎరోస్‌ ఇంటర్‌నేషనల్‌ ఈ సినిమా హక్కుల్ని 72 కోట్లకు కొన్నదని సమాచారం.

అప్పుడే ఈ సినిమా లాభాల బాటలో చేరిపోయిందని కూడా అంచనాలు వేస్తున్నారు. మరోపక్క 5 కోట్లు వ్యయంతో వేసిన విలేజ్‌ సెట్‌ పై పవన్‌ దగ్గరుండి శ్రద్ధ వహించడం, పవన్‌ తో ఉన్న పోస్టర్లు, టీజర్లు ఈ సినిమా పై భారీ అంచనాలను సృష్టించాయి.

English summary

Huge Profit for sardar Gabbar Singh Pre-Release. Power Star Pawan Kalyan and Kajal Agarwal was romancing first in the screen. Power fame Bobby is directing this movie. Raai Laxmi and Sanjana was acting in lead roles.