గర్భవతిని తప్ప మిగిలిన వాళ్ళను ఏం చేసారో తెలిస్తే భయపడతారు! 

Huge punishment for people in Indonesia

11:44 AM ON 19th October, 2016 By Mirchi Vilas

Huge punishment for people in Indonesia

నేరానికి తగ్గ శిక్ష ఉండాల్సిందే. కానీ కొన్ని చోట్ల నేరానికి తగ్గ శిక్షలు లేనందున చాలామందికి భయం లేకుండా పోతోంది. కొన్ని చోట్ల నేరానికి మించిన శిక్షలు అమానుషంగా అమలు చేస్తారు. ఇక అరబ్ కంట్రీస్ లో పరిస్థితి చూడక్కర్లేదు. ఇస్లామిక్ చట్టాన్ని అతిక్రమించిందని ఒక మహిళను దారుణంగా శిక్షించారు. ఎంత అమానుషంగా అంటే ఆ యువతిని కొన్ని వందల మంది మధ్య కూర్చోబెట్టి, ఇష్టం వచ్చినట్లు బెత్తంతో కొట్టారు. అది చూస్తున్న వాళ్లంతా నవ్వుకున్నారు. ఈ అమానవీయ సంఘటన ఇండోనేషియాలోని అసెలో జరిగింది. కాస్త చనువుగా ఉన్నారని ఆ యువతితో పాటు మరో పదమూడు మందికి ఈ శిక్ష అమలు చేశారు. వీరంతా 21 నుంచి 30 ఏళ్లలోపు వారే.

వీళ్లను అసెలోని ఓ మసీదు దగ్గరికి తీసుకువచ్చి బెత్తంతో వీపుల మీద కొట్టారు. అక్కడ ఉన్న వారంతా ఈ సంఘటనను సెల్ ఫోన్లలో చిత్రీకరించారే తప్ప ఎవరూ ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. అయితే అందులో ఓ 22 ఏళ్ల యువతి గర్భవతి అని శిక్షించకుండా వదిలేశారు. కాని ఆవిడను ప్రసవం తర్వాత శిక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. షరియా చట్టం ప్రకారం పెళ్లికాని యువతీయువకులు సాన్నిహిత్యంగా ఉండకూడదు. అంటే ఒకరినొకరు తాకడం, ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటివి చేయకూడదు. ఇండోనేషియాలోని చాలా ప్రాంతాల్లో షరియా చట్టాల్ని పకడ్భందీగా అమలు పరుస్తారు. నేరాలకు పాల్పడటం, మోసాలు చేయడం, మద్యం తాగడం, స్వలింగ సంపర్కం లాంటివి చేస్తే చాలా కఠినంగా శిక్షిస్తారు.

English summary

Huge punishment for people in Indonesia