చిత్తూరు - నెల్లూరు లలో ఆగని  వర్షం 

Huge Rains In Chitoor-Nellore Districts

01:37 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Huge Rains In Chitoor-Nellore Districts

తమిళనాడులోనే కాదు ఎపిలోని చిత్తూరు , నెల్లూరు జిల్లాలు వర్ష ప్రభావంతో వణికిపోతున్నాయి. చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షానికి తిరుపతి పర్యటన కూడా సిఎమ్ చంద్రబాబు రద్దు చేసుకున్నారు. కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. అధికారులు , జన్మభూమి కమిటీలు, సాగునీటి సంఘాలతో ఆయన పరిస్థితిని సమీక్షించారు. సిద్ధంగా వుండాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో వున్నాయి. 15గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాళంగి జలాశయం నిన్దిపోవడమే కాక ప్రమాదం అంచున చేరింది. ఇక నెల్లూరు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్వర్ణ ముఖి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆత్మకూరు , సూళ్ళూరు పేట, వెంకట గిరి మండలాల్లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ నెల్లూరు లో పర్యటించారు.

English summary

Rainfall in chittoor , nellore districts records high and due to that continous rains there were severe loss. Collecter of these districts were orderd to take proper actions to help people