'సింగం -3' ఫస్ట్ లుక్ అదిరిపోయింది!!

Huge response for Singam 3 first look

11:42 AM ON 7th January, 2016 By Mirchi Vilas

Huge response for Singam 3 first look

తమిళ స్టార్‌ హీరో సూర్యకి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌ను అమాంతం రెట్టింపు చేసింది 'యముడు' (తమిళంలో సింగం) చిత్రం. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా వచ్చిన 'సింగం -2' చిత్రం కూడా సూపర్‌ హిట్‌ కావడంతో ఇప్పుడు దీనికి మరో సీక్వెల్‌ రూపొందుతుంది. సూర్యని పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా చూపించిన హరి మరో సారి సూర్యని పోలీస్‌గా చూపించడానికి సిద్ధమయ్యాడు. 'సింగం -3' గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే వైజాగ్‌లో ప్రారంభమయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కాసేపటికి ముందే విడుదల చేశారు.

సూర్య మొహాన్ని సింహం రూపంలో రూపొందించి 'సింగం -3' పోస్టర్‌ని చాలా పవర్‌ఫుల్‌గా తీర్చి దిద్దారు. రెండు డిఫెరెంట్‌ షేడ్స్‌తో ఈ పోస్టర్లని విడుదల చేశారు. 'యూనివర్సల్‌ కాప్‌' అని క్యాప్షన్‌ కూడా పెట్టారు. ఈ పోస్టర్లని చూస్తుంటే పక్కా మాస్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతుందని అర్ధమవుతుంది. సింగం -3 లోగోని కూడా చాలా అద్భుతుంగా డిజైన్‌ చేశారు. ఈ చిత్రంలో సూర్య సరసన అనుష్క తో పాటు శృతిహాసన్‌ కూడా హీరోయిన్‌గా నటిస్తుంది.


English summary

Huge response for Singam 3 first look.