భారీసెట్స్‌ తో ఎన్‌టీఆర్‌ 'జనతా గ్యారేజ్‌'

Huge set for Ntr Janatha Garage

11:36 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Huge set for Ntr Janatha Garage

యంగ్‌ టైగర్‌ ఎన్‌టీఆర్‌ సంక్రాంతి కానుకగా విడుదల చేసిన 'నాన్నకు ప్రేమతో' సినిమా సూపర్‌హిట్‌ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమా 50 కోట్ల మార్క్‌ను కూడా క్రాస్‌ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పుడు ఎన్‌టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్‌'. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ చివరిదశకు చేరుకున్నాయి. ఈ సినిమాలో సమంత, నిత్యమీనన్‌ లు ఎన్‌టీఆర్‌ తో జతకట్టనున్నారు. మలయాళం స్టార్స్‌ మోహన్‌లాల్‌, ఫహాద్‌ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ ఫిబ్రవరి రెండవ వారంలో ప్రారంభం కానుంది.

అయితే ఎన్‌టీఆర్‌ మొదటి షెడ్యూల్‌ కు హాజరవ్వడు అని సమాచారం. ఈ షెడ్యూల్‌ లో మోహన్‌లాల్‌ పై ఉన్న ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌ ను ఘాట్‌ చేయనున్నారు. ఈ ఎపిసోడ్‌ కోసం ఎ.ఎస్‌. ప్రకాష్‌ సారధి స్టూడియో లో 2.5 కోట్లు ఖర్చు చేసి భారీసెట్‌ వేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్‌టీఆర్‌ రెండవ షెడ్యూల్‌ కి హాజరవ్వనున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

English summary

Huge set for Ntr Janatha Garage new movie. This movie is directing by Koratala Siva. Samantha and Nithya Menon were romancing with Ntr in this movie. Malayalam Super Star Mohan Lal was playing key role in this movie.