గాలి కూతురు పెళ్లికి అంతా సిద్ధం.. పెళ్లి ఆర్భాటాలు తెలిస్తే దిమ్మతిరుగుద్ది(వీడియో)

Huge sets for Gali daughter Brahmini wedding

12:59 PM ON 14th November, 2016 By Mirchi Vilas

Huge sets for Gali daughter Brahmini wedding

రాజు తలచుకుంటే... అన్నచందంగా ఓబుళాపురం గనుల రాజుగా పేరున్న కన్నడ పొలిటీషియన్ గాలి జనార్ధన రెడ్డి కూతురి పెళ్లికి సకల ఏర్పాట్లూ జరిగిపోతున్నాయి. భారత్ లో అత్యంత ఖరీదైన వివాహాల్లో ఇదొకటిగా నిలవనుంది. గాలి కుమార్తె బ్రాహ్మణి పెళ్లి గురించి ఇప్పటికే ఎంతో ప్రచారం జరిగింది. పెళ్లి కార్డుతోనే గాలి జనార్దనరెడ్డి తన ప్రత్యేకత ఏమిటో చాటుకున్నారు. ఇప్పుడు బెంగుళూరు ప్యాలస్ లో జరగబోయే ఈ పెళ్లి చూడ్డానికి రెండు కళ్లూ చాలవంటున్నారు. కొన్ని విషయాలు తెలిస్తే షాకవుతారు కూడా.

1/5 Pages

వివాహ వేడుక కోసం ఏర్పాటు చేస్తున్న వేదికకే కోట్లు ఖర్చవుతోందట. సినిమా స్టయిల్లో విజయనగర రాజ్యం కట్టడాల నమూనాలో ఈ సెట్టింగులు వున్నాయి. బాజీరావ్ మస్తానీ సినిమాకి పని చేసిన ఆర్ట్ డైరెక్టర్లు సుజీత్ సువాత్ - శ్రీరామ్ అయ్యంగర్ దీనికి వర్క్ చేస్తున్నారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల వద్ద ఎవరూ ఫోటోలు తీసుకోకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ పెళ్లికి పదుల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు.

English summary

Huge sets for Gali daughter Brahmini wedding