ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం... 100 మంది దుర్మరణం(వీడియో)

Huge train accident in Uttar Pradesh

11:40 AM ON 21st November, 2016 By Mirchi Vilas

Huge train accident in Uttar Pradesh

చెల్లాచెదురైన బోగీలు.. ప్రయాణికుల రోదనలు.. అంబులెన్స్ ల మోతలు.. ఎటుచూసినా భీతావాహ వాతావరణం. ఉత్తర్ ప్రదేశ్ లో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. అనేక కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. కాన్పూర్ దేహత్ జిల్లాలోని పుఖ్రాయాన్ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు 100 మంది మృతి చెందగా... 226 మందికి పైగా గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రయాణికుల్లో కొందరు కనిపించకపోవడంతో వారి బంధువులు ఘటనాస్థలి వద్ద వెతుకుతూ కన్నీరుమున్నీరయ్యారు.

చెల్లాచెదరుగా పడి ఉన్న బోగీలను భారీ క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు. స్వల్పంగా గాయపడినవారికి వైద్యులు ఘటనాస్థలి వద్దే చికిత్స చేస్తున్నారు. ప్రమాదంపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ, వెంటనే రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు మూడున్నర లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి 50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి 25 వేల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. సహాయక చర్యలు ముమ్మరం అయ్యాయి. ఈ ప్రమాదానికి దారి తీసిన కారణాలపై అందిన ప్రాధమిక వివరాలు పరిశీలిస్తే...

1/11 Pages

సరైన రైల్వే ట్రాక్ నిర్వహణ లేకపోవడంతో పాటు పట్టాల చుట్టూ, అడుగున కంకర వంటి వాటి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడంతో పట్టాల్లో పగుళ్లు ఏర్పాడ్డాయని దీంతో భారీ ప్రమాదం చోటుచేసుకుందని భావిస్తున్నారు.

English summary

Huge train accident in Uttar Pradesh