ఏపీలో బయటపడ్డ 33 లక్షల కోట్ల భూగర్భ నిధి!

Huge treasure in Andhra Pradesh state

10:25 AM ON 29th July, 2016 By Mirchi Vilas

Huge treasure in Andhra Pradesh state

నిధి అంటే పాత సినిమాల్లోలాగా భూమిని తవ్వుతుంటే బయటపడ్డ లంకె బిందెలు అనుకునేరు. అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. బయటపడింది నిధే కానీ లంకె బిందెలు కాదు.. 33 లక్షల కోట్లు విలువ చేసే భూగర్భ నిధి. ఏంటీ అర్ధం కాలేదా? అయితే అసలు విషయంలోకి వెళదాం.. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగిందని... ఈ నష్టాన్ని ఇప్పట్లో తీర్చగలిగలేమని... హైదరాబాద్ లాంటి మహా నగరాన్ని మరొకటి సృష్టించలేమని ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని... కష్టాల్లో ఉన్నవారిని ఎల్లప్పుడూ ఆదుకుంటుందని మరోసారి రుజువైంది. అదేంటంటే.. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బయటపడని విషయం ఒకటి... ఇప్పుడు దేవుడు ఇచ్చిన వరంలా ఏపీలో బయటపడింది.

ఏపీలోని కృష్ణా-గోదావరి(కేజీ) బేసిన్ లో సహజ వనరుల భారీ నిధి ఒకటి బయటపడింది. శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే దీన్ని గ్యాస్ హైడ్రేట్స్ అంటారు. ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే గ్యాస్ నిక్షేపం అన్నమాట. ఈ నిక్షేపలంలో దాదాపు 14 లక్షల కోట్ల ఘనపు అడుగుల గ్యాస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో అక్షరాలా 33 లక్షల కోట్లకు పై మాటే. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్ జీసీతో కలిసి అమెరికా జియోలిజికల్ సర్వే ఈ అపార నిధిని కనుగొంది. ఈ గ్యాస్ హైడ్రేట్లు పలు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించినా.. అవి ఏ రూపంలో ఉన్నాయి? వాటిని వెలికి తీయటం సాధ్యమా? అనే విషయాలపై ఇరు సంస్థలు పరిశోధనలు జరుపుతున్నారు.

రిలయన్స్ గ్యాస్ ఇండస్ట్రీస్ 2002లో కనుగొన్న అతి భారీ గ్యాస్ క్షేత్రంలో పేర్కొన్న గ్యాస్ కంటే కూడా తాజాగా కనుగొన్న కేజీ బేసిన్ గ్యాస్ హైడ్రేట్లు పది రెట్లు అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీ అభివృద్ధికి తాజాగా కనుగొన్న గ్యాస్ హైడ్రేట్స్ ఎంతోకొంత సాయం చేస్తాయనటంలో సందేహం లేదని చెప్పాలి. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడుతూ... కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ ను మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాదూ.. కూడదని.. బయటకు తరలిస్తే పైపుల నుంచి గ్యాస్ ఎలా వెళ్తుందో చూస్తామని చమత్కరించారు. దీంతో పాటు ఇలాంటి నిధి బయట పడినందుకు చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.

English summary

Huge treasure in Andhra Pradesh state