ఓటుకి నోటు కేసులో ఆ వాయిస్ వారిదే 

Huge Turn In Cash For Vote Scam

11:52 AM ON 27th November, 2015 By Mirchi Vilas

Huge Turn In Cash For Vote Scam

సంచలనం సృష్టించిన ఓటుకి నోటు కేసు కీలక మలుపు తిరిగింది. ఆడియో టేపుల్లో రికార్డైన వాయిస్ టీటిడిపి నేతలు రేవంత్ రెడ్డి , సండ్ర లదే నని ఎఫ్ ఎస్ ఎల్ నిర్ధారించింది. చార్జిషీట్ దాఖలు చేసేముందు ఎపి సిఎమ్ చంద్ర బాబు వాయిస్ శాంపిల్స్ కూడా తీసుకునే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఎం ఎల్ సి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్ సన్ కి 50లక్షల రూపాయల ఆఫర్ ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో టీ టిడిపి నేత రేవంత్ తదితరులపై కేసు నమోదైన సంగతి తెల్సిందే. రేవంత్ రిమాండ్ కి వెళ్ళడం , ఆతర్వాత బైలు పై విడుదలవడం జరిగాయి. ఇప్పుడు ఈ కేసులో రికార్డైన వాయిస్ రేవంత్ తదితరులవేనని తేలడంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో ...

English summary

Fsl says that the voice in cash for vote sacm is revanth reddy 's voice. Police to file a Charge sheet on reventh reddy and few others soon