మానవ బార్బీ ఇదుగో

Human Barbie doll who had obsession with barbie doll

05:29 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Human Barbie doll who had obsession with barbie doll

బార్బీ బొమ్మలంటే చిన్న పిల్లలకు చాలా పిచ్చి. ఎవరినైనా ఇట్టే ఆకర్షించే బార్బీ బొమ్మలు ప్రతీ సెకనుకు మూడు చొప్పున ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతాయంటే ఆ బొమ్మలకున్న క్రేజ్‌ను అర్ధం చేసుకోవచ్చు. అలాంటి వెర్రికోరిక ఉన్న ఒక యువతి మాత్రం తనను తాను బార్బీ బొమ్మగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తోంది. బార్బీ బొమ్మలా వేషం ఉంటే ఫర్వాలేదు కానీ, బార్బీ బొమ్మకు ఉండే షేపులు, సైజులను తనకూ కావాలని చేస్తున్న ప్రయత్నమే ఆమెను మానవ బార్బీగా ప్రపంచానికి పరిచయం చేసింది. బార్బీ బొమ్మలా కనిపించాలనే వెర్రి కోరికతో ఒక యువతి డజనుకు పైగా సర్జరీలకు సైతం వెనుకాడలేదు. బార్బీబొమ్మకున్న సన్నటి నడుము కోసం తన పక్కటెముకలను సైతం సర్జరీ ద్వారా తొలగించుకున్న ఈ అమ్మడు తెగింపును చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సింది.

పిక్సీఫాక్స్‌ అని పిలవబడే ఈ బార్బీడాల్‌ వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్‌. బార్బీడాల్‌ షేప్‌ను పొందేందుకు ఇప్పటికే పిక్సీ 80000పౌండ్లకు పైగా డబ్బును ఖర్చుపెట్టిందట. అంటే దాదాపు మన కరెన్సీలో 80లక్షల రూపాయలకు పైమాటే. బార్బీలా కనిపించే సన్నని నాజూకు నడుమును పొందేందుకు ఏకంగా నడుము పక్కటెముకలను సర్జరీద్వారా తొలగించుకున్న పిక్సీ తన నడుమును 14 అంగుళాలకు కుదించింది. వైద్యులు ఐదు గంటలు శ్రమకోర్చి ఈ సర్జరీని చేసారు. మొదటి తన నడుము ఎముకలను కుదించుకోవాలని కాస్మొటిక్‌ సర్జన్‌లను ఆశ్రయించినపుడు వారు చాలా కోప్పడ్డారట. కానీ పిక్సీ తను అనుకున్నది సాధించుకునేందుకు గట్టిగా ప్రయత్నించినపుడు వైద్యులు ఇక సరేననక తప్పలేదు.

ఇలాంటి అసహజమైన రూపంతో కనిపించే పిక్సీను చూసిన చాలామంది మీరు అచ్చం కార్టూన్‌లా ఉన్నారంటూ మొహం మీదే చెప్పినా, దాన్ని గొప్ప పొగడ్తగా తీసుకుని పొంగిపోతుందట.

ప్రపంచంలోనే అతిచిన్న నడుము ఉన్న యువతిగా త్వరలోనే ప్రపంచ రికార్డును కూడా స్థాపిస్తానన్న నమ్మకంతో ఈ యువతి ఉంది.

సోషల్‌ మీడియాలో మానవబార్బీగా అందరికీ సుపరిచితమైన పిక్సీకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆమె శస్త్రచికిత్సలకు అయ్యేఖర్చులను కూడా కొంత మంది అభిమానులు కూడా భరిస్తుండడం విశేషం.


English summary

A Woman Named Pixee from sweden has removed her six ribs that she felt trapped in her old body .Pixee had already spent more than £80,000 on plastic surgery for getting a view like a barbir doll